పవన్ కల్యాణ్ 20 నిమిషాల ఊచకోత
దీని ప్రకారం.. ఇందులో ఏకంగా 20 నిమిషాల పాటు సాగే ఓ హై రేంజ్ వార్ సీన్ సినిమాకు హైలైట్‌గా మారబోతుందట. ఇది సినిమా ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్‌లో వస్తుందని కూడా సమాచారం లీకైంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు వాళ్ల బాటలోనే పయణించేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రమే'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu).
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమే హరిహర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కానీ, పలు కారణాల వల్ల చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఇలా చాలా విరామం తర్వాత ఇటీవలే ఈ సినిమా షూట్‌ను పున ప్రారంభించి టాకీ పార్టును చేసుకుంటూ వెళ్తున్నారు.
'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎలా ఉన్నా.. దీనికి సంబంధించి ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ఏకంగా 20 నిమిషాల పాటు సాగే ఓ హై రేంజ్ వార్ సీన్ సినిమాకు హైలైట్‌గా మారబోతుందట. ఇది సినిమా ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్‌లో వస్తుందని కూడా సమాచారం లీకైంది.
పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతోన్న'హరిహర వీరమల్లు' సినిమా ఇంటర్వెల్ బ్లాక్ గురించి మరింత సమాచారం కూడా బయటకు వచ్చింది. ఈ వార్ సీన్ కోసం ఏకంగా 40 రోజుల పాటు షూటింగ్ జరిపారని తెలిసింది. అంతేకాదు, ఇందుకోసం పవన్ కల్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్‌లో చాలా రోజులు శిక్షణ తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన ఎంతో శ్రమించి కొన్ని రిస్కీ షాట్లు కూడా చేసినట్లు తెలిసింది. టెక్నికల్ పరంగానూ దీన్ని మరింత హైలైట్ చేయబోతున్నారట. మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ రేంజ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు.
మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న'హరిహర వీరమల్లు' సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ సహా పలువురు సీనియర్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 28న విడుదల కాబోతుంది.