తమన్.. దేవితో లాభం లేని శత్రుత్వం?

ఇక పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదం వారి మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచినట్లు టాక్.

Update: 2024-12-06 22:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుల మధ్య అనుబంధం పెద్దగా హైలెట్ అవ్వదు. నటీనటులు ఇతర దర్శకులు ఒకరినొకరు ప్రశంసించుకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య అలాంటి విషెస్ చాలా అరుదు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ లో దేవిశ్రీప్రసాద్ - తమన్ మధ్య ఉహించని వాతావరణం నెలకొన్నట్లు అనిపిస్తోంది. ఇక పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదం వారి మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచినట్లు టాక్.

దేవిశ్రీప్రసాద్ గతంలోనే పుష్ప 1 కు చేసిన మ్యూజిక్‌తో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో పుష్ప 2 లోనూ అంతే కసిగా వర్క్ చేసి గుర్తింపు అందుకోవాలని దేవి అనుకున్నాడు. కానీ చివరి లో తమన్‌ను పిలిపించి BGM కోసం పని చేయించడం అనేక ప్రశ్నలకు దారి తీసింది. అలాగే సామ్ CS ను కూడా రప్పించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, తమన్ రావడంతో దేవిశ్రీ అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ వచ్చింది.

ఇది సుకుమార్, బన్నీ తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ, ఇద్దరి మధ్య ఉన్న సంబంధానికి మరింత గ్యాప్ తెచ్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు మణిశర్మ దగ్గర శిష్యులుగా పని చేసిన దేవి మరియు తమన్ మధ్య మొదట్లో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేది. కానీ తాజా పరిణామాలు పరిస్థితిని మారుస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చినా కూడా వర్క్ చేసేవారు కాదు.

గతంలో మణిశర్మ చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో కూడా ఛాన్స్ రాగా దేవిశ్రీ తలదూర్చకుండా గౌరవించిన సందర్భాలు ఉన్నాయి. ఆ నైతిక విలువలను దేవిశ్రీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. ఇది తమన్‌, సామ్ ను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా వేసిన సెటైర్ అని చాలామంది భావించారు. ఇక ఈ వివాదంలో మరొక మలుపు సామ్ సీఎస్ స్టేట్‌మెంట్ వల్ల వచ్చింది.

పుష్ప 2 లో 90 శాతం BGM తనదేనని, క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే మ్యూజిక్ కూడా తానే అందించానని సామ్ ప్రకటించారు. కానీ టైటిల్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ పేరు మాత్రమే మ్యూజిక్ క్రెడిట్స్ కింద కనిపించడం ఆసక్తికరమైంది. అదనపు BGM కింద సామ్ పేరును పేర్కొనగా, తమన్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో అతను చేసిన వర్క్ ని తీసుకోలేదని అర్ధమవుతుంది. ఇక అనవసరంగా పిలిచి మరి దేవికి విలన్ గా మార్చినట్లు ఉంది. ఇది తమన్‌కు పెద్ద అవమానంగా అనిపించవచ్చు. కొన్ని సీన్స్ కు వర్క్ చేసినా కూడా మ్యూజిక్ డైరెక్టర్ కు క్రెడిట్ అయితే ఇవ్వాలి. కానీ తమన్ కొన్ని సీన్స్ కు వర్క్ చేసినట్లు చెప్పినప్పటికీ పేరు వేయలేదంటే అతని వర్క్ ను వాడకుండా వృధా చేసినట్లే.

ఇక ఆ క్రెడిట్ సంగతి పక్కన పెడితే దేవిశ్రీ, తమన్ మధ్య గ్యాప్ మరింత ఎక్కువైందనే మాట వినిపిస్తోంది. అసలే గతంలో దేవితో వర్క్ చూసిన త్రివిక్రమ్, బాబీ లాంటి దర్శకులు ఇప్పుడు తమన్ తో వర్క్ చేస్తున్నారు. ఎంత లేదన్నా కూడా కొంత పోటీ తత్వంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ తరుణంలో పుష్ప 2కి తమన్ రావడం మరీంత హాట్ టాపిక్ గా మారింది. దానికితోడు ఇటీవల దేవి, స్వార్థంగా ఒకరి ప్రాజెక్ట్ లను తీసుకోవాలని అనుకోను అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశారు. దీంతో దేవి తీవ్ర అసహనంతో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News