జాన్వీకి నిశ్చితార్థం.. తొంద‌ర్లోనే పెళ్లి?

అయితే ఈ వార్త‌ల‌న్నీ వ‌ట్టి పుకార్లు మాత్ర‌మేన‌ని జాన్వీ అధికారిక టీమ్ ఖండించిందని ఇంత‌లోనే వార్త‌లు వ‌చ్చాయి.

Update: 2025-01-08 06:11 GMT

హెడ్ లైన్స్ కోసం.. హెడ్డింగుల కోసం కొన్ని వార్త‌లు పుట్టుకొస్తున్నాయ‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక వార్త వెబ్ లో వైర‌ల్ గా షికార్ చేస్తోంది. ఈ వార్త సారాంశం జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో నిశ్చితార్థం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంలో శిఖర్‌తో కలిసి జాన్వీ తిరుపతికి వెళ్లింది. అయితే ఈసారి విజిట్ కి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. స్వామివారి చెంత జాన్వీ-శిఖ‌ర్ ప‌హారియాతో పాటు శిఖ‌ర్ మాతృమూర్తి (జాన్వీకి అత్త‌) కూడా ఉన్నారు. దీన‌ర్థం సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఈ జంటకు పెళ్ల‌వుతుంది. నిశ్చితార్థం గురించి తొంద‌ర్లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఒక సెక్ష‌న్ మీడియా గుసగుస‌ల్ని వైర‌ల్ చేసింది. అయితే ఈ వార్త‌ల‌న్నీ వ‌ట్టి పుకార్లు మాత్ర‌మేన‌ని జాన్వీ అధికారిక టీమ్ ఖండించిందని ఇంత‌లోనే వార్త‌లు వ‌చ్చాయి.

ఆస‌క్తిక‌రంగా 2023 లోను ఈ త‌ర‌హా పుకార్లు వచ్చాయి. అప్పుడు కూడా జాన్వీ-శిఖ‌ర్ జంట తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి విచ్చేసింది. కానీ ఆ వార్త‌ నిజం కాలేదు. ఇప్పుడు కూడా నిశ్చితార్థ వార్త‌లు కేవ‌లం పుకార్ మాత్ర‌మేన‌ని నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌లి కాలంలో క‌థానాయిక‌లు చాలా తెలివిగా త‌మ బోయ్ ఫ్రెండ్స్ తో సెట్స్ లోకి వ‌స్తున్నారు. ఒంట‌రిగా ఎక్క‌డికీ వెళ్ల‌డం లేదు. షూటింగుల‌కు వెళ్లినా.. లేదా కాఫీకి, రెస్టారెంట్ కి, మార్కెట్ కి ఎక్క‌డికి వెళ్లినా స్నేహితుల‌ను తోడు తీసుకుని వెళుతున్నారు. దీనివ‌ల్ల వారికి సెక్యూరిటీ ఉన్నార‌నే భ‌రోసా ఉంటుంది. జాన్వీ కూడా చాలా తెలివిగా త‌న స్నేహితుడిని ప‌బ్లిక్ కి ప‌రిచ‌యం చేసింది. జాన్వీలానే త‌న సోద‌రి ఖుషి క‌పూర్ కూడా ప్రియుడు వేదాంగ్ రైనా గురించి ఓపెన్ గానే ఉంది. ఇదంతా ఒక స్ట్రాట‌జీ అని న‌మ్మాల్సిన ప‌రిస్థితి ఉంది.

కెరీర్ ముఖ్య‌మా? పెళ్లి ముఖ్యమా?

కెరీర్ కోసం పెళ్లిని కాద‌నుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌ హీరో ర‌క్షిత్ తో డేటింగ్, నిశ్చితార్థం వ‌గైరా తెలిసిన వ్య‌వ‌హారాలే. కేవ‌లం కెరీర్ కోసం ర‌ష్మిక త‌న జీవితంలో కీల‌క ఘ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేసుకుంది. అయితే తాను అనుకున్న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకోవ‌డంలో స‌త్తా చాటుకుంది. ర‌ష్మిక ఇప్పుడు దేశంలో పాన్ ఇండియ‌న్ స్టార్. గోల్డెన్ లెగ్. ఏ ఇత‌ర హీరోయిన్ కి లేనంత క్రేజ్ ఉంది. ఇప్పుడు జాన్వీ క‌పూర్ త‌న ప్రియుడితో పెళ్లి కోసం అద్భుతంగా షైన్ అవుతున్న కెరీర్ ని వ‌దులుకుంటుందా? అన్న సందిగ్ధ‌త అభిమానుల్లో ఉంది. హిందీలో యువ‌త‌రం హీరోల‌తో న‌టిస్తున్న జాన్వీ క‌పూర్, టాలీవుడ్ లో ఏకంగా పాన్ ఇండియ‌న్ స్టార్లు అయిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌తో న‌టిస్తోంది. ప్ర‌భాస్, మ‌హేష్, బ‌న్ని వంటి పెద్ద స్టార్ల‌తో న‌టించాల‌ని క‌ల‌లు కంటోంది. ఇలాంటి స‌మ‌యంలో స్టార్ డ‌మ్ ని కాద‌నుకుని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాల‌ని జాన్వీ భావిస్తోందా?

Tags:    

Similar News