శ్రుతి హాసన్.. ఆ మూవీ నుంచి తప్పుకుందా?

ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే శ్రుతి ఆ మూవీ నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతోంది.

Update: 2024-10-15 01:30 GMT

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే. విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మొదట్లో సింగింగ్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్న అమ్మడు.. ఆ తర్వాత హీరోయిన్ గా సత్తా చాటుతున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాలో శ్రుతి హాసన్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.

అయితే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన శ్రుతి హాసన్.. చివరగా సలార్ మూవీలో కనిపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఆ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు చిత్రాల పరంగా చూస్తే.. డెకాయిట్ మాత్రమే ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షనైల్ డియో తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో తుపాకీ పట్టుకుని.. శ్రుతి గ్లింప్స్ లో కనిపించారు. అడవి శేష్, శ్రుతి ప్రేమించుకుని విడిపోయి మళ్లీ కలిసి దోపిడీలు చేయడం చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే శ్రుతి ఆ మూవీ నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతోంది.

డేట్స్ ఇష్యూ వల్ల శ్రుతి హాసన్ డెకాయిట్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ షనైల్ డియో తన ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడం వల్ల రీసెంట్ గా అమెరికాకు వెళ్లారట. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి! దీంతో తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేక శ్రుతి హాసన్.. మూవీ నుంచి బయటకు వచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ యూనిట్.. మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సగం షూటింగ్ అయ్యాక శ్రుతి హాసన్ మూవీ నుంచి తప్పుకుంటే నిర్మాణ ఖర్చు భారీగా పెరుగుతుందని చెబుతున్నారు నెటిజన్లు. దానికి తోడు ఆమెకు సరైన రీప్లేస్ మెంట్ దొరకడం కష్టమని అంటున్నారు. కాబట్టి శ్రుతి హాసన్ కోసం మేకర్స్ వెయిట్ చేయడమే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. మరి డెకాయిట్ విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News