'ఈగల్' థియేటర్స్ ఆ సినిమాకేనా.. నిర్మాత క్లారిటీ!

అందుకే గత కొద్ది రోజులుగా దర్శక నిర్మాతలు దీనిపై చర్చలు జరుపుతూ చివరికి 'ఈగల్' సినిమాని.

Update: 2024-01-05 11:10 GMT

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు పోటీకి సిద్ధం అయ్యాయి. నిన్నటివరకు గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ నా సామి రంగ వంటి సినిమాలు పోటీలో నిలవగా.. ఈ సినిమాల నుంచి రవితేజ 'ఈగల్' సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంది. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అన్నిటికీ సరైన థియేటర్స్ దొరకడం కష్టమవుతుంది.

దాంతోపాటు కలెక్షన్స్ పై కూడా ప్రభావం పడుతుంది. అందుకే గత కొద్ది రోజులుగా దర్శక నిర్మాతలు దీనిపై చర్చలు జరుపుతూ చివరికి 'ఈగల్' సినిమాని. రేసు నుంచి తప్పించారు. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో జనవరి 12న 'గుంటూరు కారం, 'హనుమాన్' సినిమాలు విడుదలవుతుంటే మరునాడు అంటే జనవరి 13న 'సైంధవ్' జనవరి 14న 'నా సామిరంగా' రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే 'ఈగల్' పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు కేటాయించిన థియేటర్స్ ని నాగార్జున 'నా సామిరంగా' కి ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయమై 'సైంధవ్' మూవీ ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు. 'ఈగల్ థియేటర్స్ ని కేవలం నా సాంమిరంగా సినిమాకి ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న థియేటర్స్ ని సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకు పంచబడతాయని' వెల్లడించారు.

ఇక సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న 'ఈగల్' ఫిబ్రవరి నెలలో సోలో రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 9న 'ఈగల్' సినిమాను తెలుగులో పాటు హిందీలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటిస్తూ.." బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు. మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు" అంటూ ట్వీట్ చేసారు.

మరోవైపు ఇదే ఫిబ్రవరి 9 కి టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' తో పాటు సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ డేట్ ని 'ఈగల్' ఆక్యుపై చేయడంతో ఆ రెండు సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కునే పనిలో పడ్డాయి.

Tags:    

Similar News