అదే నిజమైతే జాన్వికి తిరుగు ఉండదంతే..!

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వి ఛాన్స్ అందుకుంది.

Update: 2024-06-01 02:45 GMT

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ అనుకున్నట్టుగానే సౌత్ లో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే దూసుకెళ్తుంది. శ్రీదేవి లానే సౌత్ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకోవాలని ఫిక్స్ అయిన జాన్వి కపూర్ తెలుగులో మొదటి ఆఫర్ అందుకుంది. తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వి ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ నెక్స్ట్ సినిమాకు సైన్ చేసింది. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ తో జత కడుతున్న జాన్వి ఈ రెండు సినిమాలతో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

ఐతే ఈ రెండే కాదు మూడో సినిమా కూడా లైన్ లో ఉంది అన్నట్టు తెలుస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వికి అవకాశం ఇస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. తన సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో రాజమౌళి చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పాత్రకు తగినట్టుగా అది ఎలాంటి వారైనా సరే రంగంలోకి దించుతాడు. ఐతే మహేష్ కోసం ఎంచుకున్న కథలో కథానాయిక పాత్రకు జాన్వి పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట.

అందుకే జాన్వితో సంప్రదింపులు చేస్తున్నారని టాక్. రాజమౌళి సినిమా రావాలే కానీ జాన్వి మరో మాట మాట్లాడకుండా ఓకే చేస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారు. అలాంటిది జాన్వి కపూర్ ఆ ఛాన్స్ ఎలా వదులుకుంటుంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో జాన్వి సెలెక్ట్ అన్నది నిజమే అయితే మాత్రం అమ్మడికి ఇక తిరుగుఉండదని చెప్పొచ్చు.

జాన్వి కపూర్ ఓ పక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ సౌత్ సినిమాలను ఓకే చేస్తుంది. కెరీర్ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తుంది. ఎలాగు తెలుగులో స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అలా కూడా జాన్వికి కలిసి వస్తుంది. సో ఇప్పటికే తారక్, చరణ్ సినిమాల్లో ఛాన్సులతో అదరగొట్టేస్తున్న జాన్వి మహేష్ సినిమా అవకాశం కూడా అందుకుంటే మాత్రం జాన్విని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. SSMB 29 సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ లో హీరోయిన్ గురించి కూడా డీటైల్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ సినిమా అనౌన్స్ మెంట్ వరకు హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News