బాలీవుడ్ లో శ్రీలీల… తేడా కొట్టదుగా?

ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది.

Update: 2024-08-15 13:30 GMT

సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదటి చిత్రంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత రవితేజకి జోడీగా చేసిన ధమాకా కమర్షియల్ హిట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ గా నిలిచింది, భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కూడా శ్రీలీల ఆ చిత్రంలో హీరోయిన్ కాదు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది.

ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నా కూడా శ్రీలీల క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు. మూవీ కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. దీంతో తెలుగులోనే శ్రీలీల కెరియర్ సోసోగా సాగుతోంది. శ్రీలీల హోప్స్ అన్ని కూడా డిసెంబర్ లో రాబోయే రాబిన్ హుడ్ సినిమా మీదనే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు రవితేజతో మరో సినిమాని శ్రీలీల చేస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది రానున్నాయి.

శ్రీలీల స్టోరీ సెలక్షన్ కరెక్ట్ గా లేదనే మాట సినీ విశ్లేషకుల నుంచి ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్స్ లలో చాలా మంది తమ పాత్రలకి ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే మూవీస్ ఒప్పుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా పాన్ ఇండియా లెవల్ లో దూసుకుపోతున్న రష్మిక చాలా సెలక్టివ్ గా మూవీస్ చేస్తోంది. భగవంత్ కేసరి సినిమా చూస్తే శ్రీలీల మంచి మంచి టాలెంటెడ్ యాక్టర్ అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ గా ఆమె ప్రాధాన్యత లేని పాత్రలే చేసిందని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు.

దర్శకులు కూడా శ్రీలీలలో గ్లామర్, డాన్స్ టాలెంట్ ని చూసి అవకాశాలు ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న మిట్టీ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైందంట. అక్టోబర్ నుంచి ఆమె షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఈ మూవీ రెగ్యులర్ షూట్ జరుగుతోంది.

గత కొంతకాలంగా సిద్ధార్ధ్ కి బాలీవుడ్ లో సక్సెస్ లు లేవు. అతని సినిమాలకి పెద్దగా బిజినెస్ కూడా జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ సినిమానే అలాంటి స్టార్ కి జోడీగా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్ద రిస్క్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన మరల బాలీవుడ్ దర్శకులు శ్రీలీలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉందదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ చిత్రంలో మంచి బలమైన పాత్రలో శ్రీలీల నటిస్తుందంట. మిట్టీ మూవీ ఆమెకి బాలీవుడ్ లో ఎంత వరకు క్రేజ్ తీసుకొస్తుందనేది అప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే గతంలో వరుణ్ ధావన్ కి జోడీ ఆమె ఒక సినిమాలో కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం జరిగింది. దాంట్లో వాస్తవం లేదని ఆ చిత్రం నిర్మాత తేల్చేశారు. దీంతో హిందీలో శ్రీలీల డెబ్యూ మూవీగానే మిట్టీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News