గ్లామర్ అంచులను దాటుతూ ఐశ్వర్య స్టన్నింగ్ లుక్
ఇక ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలలో ఐశ్వర్య మీనన్ అందంగా మెరిసిపోతూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
గ్లామరస్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే గ్లామరస్ క్వీన్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ ఒకరు. అమ్మడు చూడగానే తన అందమైన క్యూట్ లుక్స్ తో మనసు దోచేస్తోంది. చాలా తక్కువ టైమ్ లోనే ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలలో ఐశ్వర్య మీనన్ అందంగా మెరిసిపోతూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
లేటెస్ట్ ఫోటోషూట్‌లో కాఫీన్, గ్యాసోలిన్ వంటి అనుభూతులతో ఉన్నట్టు క్యాప్షన్ ఇచ్చింది. ఈ లుక్లో ఆమె ఒంటరిగా రివింగ్‌లో గ్లామర్‌ని చూపిస్తూ, తనలోని స్టైల్‌ను మరింత హైలెట్ చేసింది. బొమ్మల్లోని కాంతులు, బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్‌తో మరింత రంగు పులిమిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ఐశ్వర్య మీనన్ ఎలా కనిపించినా అందమే అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఐశ్వర్య మీనన్ తెలుగు ప్రేక్షకులకు 'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో పరిచయం అయింది. తమిళ్, కన్నడ చిత్రాల్లో కెరీర్ మొదలుపెట్టినా, అప్పట్లో పెద్ద సక్సెస్ దక్కలేదు. అయితే ఇటీవల తన గ్లామరస్ ఫోటోషూట్‌ల ద్వారా ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ, మోస్ట్ అవైటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇక ఆమె ఎలాంటి సినిమాలు చేసినా అందులో కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఆ మధ్య మలయాళంలో ఫాహాద్ ఫాజిల్ తో 'మాన్ సూన్ మంగూస్' అనే చిత్రంలో నటించి విమర్శకుల.ప్రశంసలు అందుకుంది.
ఇక టాలీవుడ్‌లో కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసింది. నిఖిల్ సిద్ధార్థ్ తో 'స్పై' చిత్రంలో కనిపించింది. ఈ పాన్-ఇండియా సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు అవుతుందని ఆశించింది కానీ అదేమీ పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక కార్తికేయ తో చేసిన భజే వాయు వేగం సినిమా మాత్రం మంచి గుర్తింపుని అందించింది. ప్రస్తుతం తెలుగులో అయితే ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. మలయాళంలోనే బజూక అనే సినిమా చేస్తోంది.