2023 ఇండియన్ సినిమాకి బ్లాక్ బస్టర్ ఇయర్!
ఒకే ఏడాది ఇలా గణాంకాలు నమోదు కావడం అన్నది ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకూ చోటు చేసుకోలేదు.
2023 ని బ్లాక్ బస్టర్ ఇయర్ గా ప్రకటించొచ్చా? 2023 బాక్సాఫీస్ వద్ద ఓ సంచలనమే నమోదు చేసింద నొచ్చా? అంటే నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిందే. ఇండియన్ సినిమాకి 2023 ఉత్తమ క్యాలెండర్ గా నిలిచిపోయింది. ఏకంగా ఒకే ఏడాది ఆరేడు సినిమాలు 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతోనే 2023 ఈ రికార్డును చేజిక్కిచుకుంది. ఒకే ఏడాది ఇలా గణాంకాలు నమోదు కావడం అన్నది ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకూ చోటు చేసుకోలేదు. దీంతో 2023 అరుదైన రికార్డును అందుకుంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...
షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `పఠాన్`..`జవాన్` సినిమాలు ఏకంగా రెండు సినిమాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూళ్లని సాధించాయి. మొదటి నాలుగు ..ఐదు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన `గదర్-2` ఏకంగా 600 కోట్లు పైగావసూళ్లని సాధించింది. ఇక నార్త్ రీజియన్ నుంచి తెలుగు దర్శకుడు పనిచేసిన `యానిమల్` బాక్సాఫీస్ ని ఎలా మోతెక్కించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా 800 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది.
ఇక కోలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `జైలర్`..`లియో` చిత్రాలు భారీ వసూళ్లే సాధించాయి. జైలర్ 600 కోట్లు..లియో 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలుగా నిలిచాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన `సలార్` లెక్క ఎంతవరకూ వెళ్తుందో ఎవరూ ఊహించనిది. ఇప్పటికే సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద దున్నేస్తుంది. 800 కోట్లతో ఆగుతుందా? అంతకు మించి దూకుడు చూపిస్తుందా? అన్నది వెయిట్ చేయాలి.
ఇలా ఒకే ఏడాది ఇన్ని సినిమాలు 500 కోట్లకు పైగా వ సూళ్లు సాధించడం అన్నది భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. 2015లో రాజమౌళి- ప్రభాస్‌లు బాహుబలితో దేశీయంగా 500 కోట్ల రూపాయల మార్కెట్‌ను ప్రారంభించ డంతో ఈ ట్రెండ్ మొదలైంది. అమీర్ ఖాన్ యొక్క `దంగల్ `2016లో ఈ ఫీట్‌ను సాధించింది. ఆ తర్వాత 2017 లో `బాహుబలి-2.`.రజనీకాంత్ `2.0` 2018లో ఈ ఘనతను సాధించాయి. 2022లో ఆర్ ఆర్ ఆర్- కేజీఎఫ్ - 2 ఈ మైలురాయిని అధిగమించాయి.