ఆ ఫాలోయింగ్ ఏమాత్రం ఉపయోగపడట్లేదా..?
అలానే జబర్దస్త్ షోతో క్రేజ్ తెచ్చుకుని ఆ క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకుని చిన్నగా లీడ్ రోల్ ఛాన్సులు దక్కించుకున్నాడు సుడిగాలి సుధీర్.
బుల్లితెర మీద సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వెండితెర మీద సక్సెస్ అవ్వాలని రూల్ ఏమి లేదు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఫైనల్ గా వారి డెస్టినేషన్ మాత్రం సిల్వర్ స్క్రీన్ పై మెరవాలనే ఉంటుంది. అలానే జబర్దస్త్ షోతో క్రేజ్ తెచ్చుకుని ఆ క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకుని చిన్నగా లీడ్ రోల్ ఛాన్సులు దక్కించుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో వేణు వండర్స్ టీం లో జాయిన్ అయ్యి ఆ తర్వాత వేణు వెళ్లాక అతనే టీం లీడర్ అయ్యి కొన్నేళ్లుగా ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.
అయితే సినిమాల్లో బిజీ అవుతున్న టైం లో జబర్దస్త్ ను పూర్తిగా వదిలేశాడు. కొన్నాళ్లు హీరో పక్కన ఫ్రెండ్ రోల్స్ వేసిన సుధీర్ హీరోగా అప్గ్రేడ్ అయ్యాడు. తనకున్న బుల్లితెర ఫాలోయింగ్ తో సిల్వర్ స్క్రీన్ పై కూడా చెలరేగిపోదామని అనుకున్నాడు సుధీర్. కానీ వెండితెర మీద సక్సెస్ అవ్వడం అంటే అది అంత ఈజీ పనేమి కాదు. హీరోగా సుధీర్ ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేందుకు టైం తీసుకున్నారు.
జబర్దస్త్ చేస్తున్న టైం లో ఢీ షోలో హోస్ట్ గా ఉన్న టైం లో తనని ఎంకరేజ్ చేసిన ఫ్యాన్స్ అంతా కూడా సిల్వర్ స్క్రీన్ కు వచ్చాక పట్టించుకోవడం మానేశారు. సుధీర్ హీరోగా చేసిన మూడు నాలుగు సినిమాలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయని చెప్పొచ్చు. సుధీర్ కూడా తనకు ఆడియన్స్ లో ఉన్న ఐడెంటిటీ తో కొత్త ప్రయోగాలు చేసి మెప్పిస్తే బాగుంటుంది కానీ జబర్దస్త్ లో చేసిన కామెడీనే చేస్తా అంటే కుదరదు.
మొదటి రెండు సినిమాలు అలానే చేసి ఫెయిల్ అయిన సుధీర్ తర్వాత కాస్త మారి సినిమాలు చేస్తున్నాడు. ఎంత చేసినా సరే సుధీర్ సినిమా ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయలేకపోతుంది. బుల్లితెర మీద స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇలా వెండితెర మీద హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. జబర్దస్త్ చూసి సుధీర్ అన్న తోపు అన్న ఆ ఫ్యాన్ బేస్ అంతా కూడా అతను సినిమాలు చేస్తున్న టైం లో సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఆ ఫ్యాన్ బేస్ తో సంబంధం లేకుండా సుధీర్ స్వతహాగా మంచి కథలతో ప్రేక్షకులను అలరించాల్సి ఉంటుంది. హిట్ సినిమా కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధం అనేలా రెడీగా ఉన్న సుధీర్ కు ఆ సూపర్ హిట్ సినిమా ఏ డైరెక్టర్ ఇస్తారన్నది చూడాలి.