ఆ బ్యూటీ గుండెల్లో మళ్లీ ఈడీ రైళ్లు
బుధవారం తర్వాత ఆమెని ఈడీ విచారణకు రావాలని నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని నెలలుగా జాక్వెలిన్ పెర్నాండేజ్ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రీగా సినిమాలు చేసుకుంటోంది. అనుమతులతో సంతోషంగా విదేశాలకు వెళ్లగల్గుతుంది. ముంబైలో స్నేహితులతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది. కానీ అమ్మడి గుండెల్లో మళ్లీ ఈడీ రైళ్లు మొదలయ్యాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో రౌండ్ విచారణ కోసం సమన్లు జారీ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం తర్వాత ఆమెని ఈడీ విచారణకు రావాలని నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో మళ్లీ జాకీ ఈడీ అధికారుల వలయంలోకి వెళ్లినట్లు అయింది. జాక్వెలిన్‌కు ఈడీ సమన్లుజారీ చేయడం తొలిసారి కాదు. ఇప్పటికే అధికారులు అమెను రెండు, మూడుసార్లు విచారించారు. ఆ సమయంలో ఆమె నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. 200 మనీ లాండరింగ్ కేసులో తనకెలాంటి సంబంధం లేదని కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్ నేరపూరిత కార్యకలాపాల గురించి తనకు తెలియదని, చిత్తశుద్ధితో బహుమతులు అందుకున్నానని నటి గతంలోనే పేర్కొంది.
అయితే చంద్రశేఖర్ అరెస్ట్ తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మొబైల్ నుంచి మొత్తం డేటాను డెలిట్ చేసిందని, ఆ తర్వాత సాక్ష్యాలన్నింటిని తారుమారు చేసిందని.. సాక్ష్యాలను నాశనం చేయాలని ఆమె తన సహోద్యోగులను కూడా కోరిందని ఈడీ ఆరోపించింది. చంద్రశేఖర్ డబ్బును జాక్వెలిన్ ఉపయోగిం చిందని ఈడీ పేర్కొంది.
2022లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో సుకేషన్ చంద్రశేఖర్ అందించిన విలువైన వస్తువులు, నగలు, ఖరీదైన బహుమతులను జాక్వెలిన్ తీసుకుందని ఈడీ ఆరోపిస్తుంది. ఈడీ విచారణ తర్వాత చంద్రశేఖర్ తనతో ఉన్న రిలేషన్ షిప్ గురించి మరోసారి మీడియాకి చెప్పే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు.