ఎఫ్ ఐఆర్ కొట్టేయాలని జాకీ...సంబంధాలున్నాయని ఈడీ!
ఆమె సామాజిక వృత్తిపరమైన పనులను కూడా ప్రభావితం చేస్తుంది' అని వెల్లిండిం చింది. అయితే ఈ కేసులో జాక్వెలిన్ ఈడీకి సహకరించలేదని ఈడీ చెబుతుంది.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ ఆరోపణలు ఎదుర్కుంటోన్న సంగతి తెలిసిందే. తొలుత కేసులో కీలక పాత్ర ధారి అయిన కాన్ మాన్ సుకేష్ చంద్రతో సన్నిహితంగా మెలిగిన వ్వవహారం..అటుపై ఈడీ విచారణ తర్వాత అదే కేసుకు సంబంధించి సుకేష్ పై ఎటాకింగ్ దిగడంతో సన్నివేశం ఎంత రసవత్తరమైందో తెలిసిందే.ఇద్దరు ఒకరిపై ఒకరు అదనపు కేసులు బనాయిం చుకోవడంతో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. తనకేం తెలియదని. తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ కొట్టేయాలని కోర్టులో జాక్వెలిన్ కేసు వేయడం తెలిసిందే.
అయితే ఈ కేసుతో జాక్వెలిన్ కి సంబంధాలున్నాయని ఈడీ కోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ ముందుకు వెళ్లింది. దీనిపై కొంత విచారణ అనంతరం తదుపరి విచారణ ఏప్రిల్ 15కి వాయిదా వేసింది హైకోర్టు. అలాగే సుకేష్ చంద్రశేఖర్ నుంచి రక్షణ కోరుతూ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఇటీవల జాక్వెలీన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని కోర్టులో తాను కోర్టు విచారణలో పాల్గొంటున్నప్పుడు తనకు సందేశాలు - వాయిస్ నోట్ పంపిన సుకేష్ చంద్రశేఖర్ నుండి రక్షణ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది.
అవన్నీ తప్పు అని చెబుతూ.. అతని లేఖలు తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని పిటీషన్ లో పేర్కొంది. తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగానే మీడియాకి చెడుగా ఫోకస్ చేస్తున్నాడని..అతడిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్దిక నేరాల విభాగం కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే వీటిపై ఆర్దిక నేరాల విభాగం స్పందించినట్లు తెలుస్తోంది. సుకేష్ నిత్యం లేఖలు పంపుతున్నాడని హైలైట్ చేసింది. మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జాక్వెలీన్‌కు సంబంధించిన లేఖలను పంపడం అలవాటు చేసుకు న్నాడని.. ఇది ఆమెను నేరుగా బెదిరించడం మాత్రమే కాదు.
ఆమె సామాజిక వృత్తిపరమైన పనులను కూడా ప్రభావితం చేస్తుంది' అని వెల్లిండిం చింది. అయితే ఈ కేసులో జాక్వెలిన్ ఈడీకి సహకరించలేదని ఈడీ చెబుతుంది. డేటాను తన ఫోన్ నుంచి డిలీట్ చేసిందని..అలాగే తన సన్నిహితుల వద్ద కూడా ఎలాంటి డేటా లేకుండా తొలగించిందని..ఈ కేసుతో జాక్వెలిన్ కి దగ్గర సంబంధాలున్నాయని ఈడీ ఆరోపిస్తుంది.