జాక్వెలిన్ అలంక‌ర‌ణ ఎంత అందంగా అంటే?

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ ని సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపిచ‌డం అన్న‌ది రేర్ గా కూడా జ‌ర‌గ‌దు.

Update: 2024-07-13 15:30 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ ని సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపిచ‌డం అన్న‌ది రేర్ గా కూడా జ‌ర‌గ‌దు. అమ్మ‌డు నిత్యం మోడ్ర‌న్ గానే హైలైట్ అవుతుంది. ఇన్ స్టా మొత్తం చెక్ చేస్తే ఆ త‌ర‌హా ఫోటోలే క‌నిపిస్తాయి. సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించ‌డం అన్న‌ది ఎక్క‌డో గానీ జ‌ర‌గ‌దు. వెకేష‌న్ వెళ్తే స్విమ్ షూట్.. బీచ్ దుస్తుల్లో క‌నిపిస్తుంది? రెస్టారెంట్..నైట్ పార్టీల‌కు వెళ్తే సొగ‌సైన ఔట్ ఫిట్ లు ధ‌రిస్తుంది.


ఇక జిమ్..యోగా టైమ్ లో స్కిన్ టైట్ ఫిట్స్ లో ద‌ర్శ‌న‌మిస్తుంది. విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు క్యాజువ‌ల్స్ లోనే వ‌య్యారాల‌న్నీ ధార‌బోస్తుంది. అలాంటి బ్యూటీని ప‌ట్టుకుని సంప్ర‌దాయ దుస్తుల్లో ఊహించ‌డం అన్న‌ది అనవ‌స‌ర‌మైన ఆలోచ‌నే. అలాంటి బ్యూటీ అంబానీ ఇంట పెళ్లి కోసం ఎంత అందంగా ముస్తాబైం దో తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. అమ్మ‌డు సంప్ర‌దాయ లెహంగా దుస్తుల్లో త‌ళుకులీనిన వైనం చూస్తే మ‌తి పోతుంది.


ఇదిగో ఇక్క‌డ బ్రౌన్ క‌ల‌ర్ లెహంగాలో ఎంతో చూడ ముచ్చ‌ట‌గా ముస్తాబైంది. మెడ‌లో అమ్మ‌డు ధ‌రించిన హారం..చెవుల‌కు ధ‌రించిన భుట్ట‌లు..చేతికి వేసుకున్న క‌డియాలు ప్ర‌తీది జాకీని ఎంతో అందంగా తీర్చిది ద్దాయి. ఒక్క క్ష‌ణం పాటు ఆమె శ్రీలంక బ్యూటీనా? ఇండియ‌న్ బ్యూటీనా? అన్న సందేహం రాక‌మాన‌దు. అంత అందంగా లెహంగా దుస్తుల్లో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


జాక్వెలిన్ ట్రాన్ప‌ప‌ర్మేష‌న్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ యూజ‌ర్ అయితే! అంబానీ ఇంట డ్రెస్ కోడ్ పెట్ట‌డంతో ఇలా లెహంగా ధ‌రించింది లేదంటే? జాకీ మార్క్ బ్యూటీ ప‌డేదంటూ కామెంట్ పెట్టాడు. అది మిన‌హాయిస్తే మెజార్టీ వ‌ర్గ‌మంతా జాకీ అందాన్ని పొగిడేస్తూ అంతా పాజిటివ్ గా స్పందించారు.

Tags:    

Similar News