కండోమ్ కంపెనీపై సుహాస్ కేసు కథ..
యువ నటుడు హీరోగా మారిన తరువాత సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.
యువ నటుడు హీరోగా మారిన తరువాత సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా లవ్ ఎమోషన్ కామేడి మీద నడిచే కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇక
అతను హీరోగా నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి రాబోతున్న ‘జనక అయితే గనక’ ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 'బలగం' సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన దిల్ రాజు ప్రొడక్షన్స్‌కి ఇది మూడో ప్రాజెక్ట్.
ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తేనే, ఈ సినిమా డిఫరెంట్ కామెడీ లైన్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో సుహాస్ ఒక వాషింగ్ మెషీన్ కంపెనీలో పని చేసే సాధారణ ఉద్యోగి.
తన భార్య (సంగీర్తన) తో సుఖంగా జీవితాన్ని గడుపుతున్న ఈ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వలన పిల్లలను కనకూడదు అని ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతని భార్య ఆ విషయాన్ని పట్టించుకోకుండా నెల తప్పడంతో, అతను షాక్ అవుతాడు. ఇక, సమస్య నుంచి బయటపడటానికి కండోమ్ కంపెనీపై విచిత్రమైన కేసు వేయాలని నిర్ణయించుకుంటాడు.
ఈ విచిత్రమైన కేసు కథలో ప్రధానమైన కామెడీని హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ బండ్ల ఈ సినిమా ద్వారా సమాజంలో కొన్ని పద్ధతులు, వ్యక్తిగత నిర్ణయాల గురించి కామెడీ యాంగిల్ లో హైలెట్ చేసిన విధానం బాగానే హైలెట్ అయ్యింది. కండోమ్ కంపెనీపై కేసు వేయడం వినూత్నమైన ఐడియా. ఆ తరువాత తన కుటుంబం దానిపై ఎలా రియాక్ట్ అయ్యింది? అసలు పిల్లల విషయంలో నేటి తరం ఆలోచన విధానం ఎలా ఉంది? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
సుహాస్ టైమింగ్, వెన్నెల కిషోర్ లా హాస్య నటుల పాత్రలు ఈ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. చిన్న కాన్సెప్ట్ తో పెద్ద నవ్వులు పండించే లక్ష్యంతో రూపొందిన ఈ సినిమా, సెప్టెంబర్ 6న ప్రేక్షకులను థియేటర్లలో నవ్వించాలని సిద్ధమవుతోంది. మరి సుహాస్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.