ఆ హీరోతో జాన్వీ ఇంటిమేట్ సీన్సా?
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ సినిమాలోనే రొమాంటిక్ పెర్మార్మెన్స్ తో అదర గొట్టింది.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ సినిమాలోనే రొమాంటిక్ పెర్మార్మెన్స్ తో అదర గొట్టింది. `ధడక్` లో ఇషాన్ కట్టర్ తో కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ అమ్మడు ఆ ఛాన్స్ తీసుకోలేదు. స్టోరీలో పాత్రలు డిమాండ్ చేయకపోవడంతో జాన్వీ కి ఆ ఛాన్స్ రాలేదు. ధడక్ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ వేటిలోనే హీరోలతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో కనిపించలేదు.
తాజాగా రిలీజ్ అయిన `దేవర` లో మాత్రం స్కిన్ షోతో అలరించింది. అంతకుమించి తారక్ తో క్లోజ్ సన్నివేశాలం టూ ఏవీ లేవు. అయితే అమ్మడిప్పుడు మళ్లీ `బవాల్` నటుడు వరుణ్ ధావన్ తో కలిసి `సన్నీ సంస్కారీకి తులసి కుమారీ` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శశాంక్ కైతాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాడు. స్వచ్ఛమైన లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ధడక్ తర్వాత జాన్వీ నటిస్తోన్న లవ్ స్టోరీ కూడా ఇదే.
సన్ని అనే యువకుడు తన ప్రియురాలి ప్రేమను పొందడం కోసం చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. ఇందులో తులసి పాత్రలో జాన్వీ కనిపిస్తుంది. అయితే ఇందులో అమ్మడు వరుణ్ ధావన్ తో చాలా రొమాంటిక్ సన్నివేశాలు చేస్తుందిట. లిప్ లాక్ సన్నివేశాలు..ఇంటిమేట్ బెడ్ రూమ్ సన్నివేశాలు సైతం డిమాండ్ చేయడంతో జాన్వీ ముందుకెళ్తుందిట. ప్రేమలో ఘడతను హృద్యంగా చిత్రీకరించాలంటే? అలాంటి సన్నివేశాల్లో హీరో-హీరోయిన్లు నటించాల్సి రావడంతో? జాన్వీ నో చెప్పకుండా ముందుకెళ్తుందిట.
ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. మూడవ షెడ్యూల్ లో ఈ ఇంటిమేట్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. వీటిని ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో చిత్రీకరిం చనున్నారుట. ఇంటిమేట్ సీన్లు కావడంతో కేవలం దర్శకుడు, కెమెరా మెన్, మరో ఇద్దరు అసిస్టెంట్లు మినహా ఇంకెవ్వరూ లేకుండా ఈ సన్నివేశాల షూట్ ప్లాన్ చేస్తున్నారుట.