ఫోటో స్టోరి: కపూర్ సిస్టర్స్ బికినీ బీచ్ ట్రీట్
కపూర్ గాళ్స్ జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ చాలా కాలంగా అభిమానులు కోరుకునే ట్రీట్ ని అందిస్తున్నారు.
కపూర్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ లేని లోటు అలాగే ఉంది. ఫ్యాషన్ వరల్డ్ నుంచి.. బికినీ బీచ్ సెలబ్రేషన్ నుంచి సోనమ్ అనూహ్యంగా మాయమైంది. పెళ్లి తర్వాత పూర్తిగా సోనమ్ లండన్ లో బిజినెస్ ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ లోటు తీర్చేదెవరు? అంటే దానికి సమాధానం ఉంది. దానిని ఫుల్ ఫిల్ చేసేందుకు అన్ లిమిటెడ్ ట్రీట్ ఇచ్చేందుకు కపూర్ ఫ్యామిలీ నుంచే నట వారసురాళ్లు జాన్వీ కపూర్- ఖుషి కపూర్ తమ వంతు కృషి చేస్తున్నారు. అందుకు ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ఫోటోనే నిదర్శనం.
కపూర్ గాళ్స్ జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ చాలా కాలంగా అభిమానులు కోరుకునే ట్రీట్ ని అందిస్తున్నారు. ఇప్పుడు మరోసారి స్టన్నింగ్ బికినీ షో ఇంటర్నెట్ లో దుమారంగా మారింది. సిస్టర్స్ బికినీ బీచ్ ట్రీట్.. ముఖ్యంగా ఇలా బ్యాక్ లెస్ ఫోజ్ తో యూత్ లో గుబులు పెంచారు. జాన్వీ-ఖుషీ సాయం సంధ్య వేళ సముద్ర స్నానానికి వెళ్లారు. సూర్యుడు అస్తమించే సమయాన అర్థనగ్నంగా స్విమ్ వేర్ లో కనిపించారు. జలకాలాటలకు ముందు కెమెరాకు ఇలా ఫోజులిచ్చారు. ఈ స్పెషల్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ``నేను చంద్రుడిని చూస్తాను.. కానీ నేను నిన్ను చూస్తాను!`` అని కవితాత్మకంగా దీనికి క్యాప్షన్ ఇచ్చారు. జాన్వి బ్లూ స్విమ్‌వేర్‌ను ఎంచుకుంటే, ఖుషీ ఎరుపు రంగు స్విమ్‌సూట్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో సునామీలా మారింది. కపూర్ సిస్టర్స్ హాట్ నెస్ గురించి గుసగుస వేడెక్కిస్తోంది.
ఓవైపు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న కపూర్ సిస్టర్స్ వీలున్న ప్రతిసారీ తీరిక సమయాన్ని స్పెషల్ ఫోటోషూట్ల కోసం కేటాయిస్తున్నారు. వెబ్ ని స్పైసప్ చేసే ఫోటోషూట్లతో మతులు చెడగొడుతున్నారు. జాన్వీ కపూర్ నటించిన దేవర ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. బాలీవుడ్ లో రాజ్‌కుమార్ రావుతో కలిసి మిస్టర్ & మిసెస్ మహిలో నటించింది. ఆ తర్వాత ఆమె రోషన్ మాథ్యూ, గుల్షన్ దేవయ్య, ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్ మరియు రాజేష్ తైలాంగ్‌లతో కలిసి ఉలాజ్‌లో నటించింది. జాన్వీ తదుపరి రామ్ చరణ్ సినిమాలో కనిపించనుంది. వరుణ్ ధావన్‌తో కలిసి శశాంక్ ఖైతాన్ `సన్నీ సంస్కారీ కి తులసి కుమారి`లో కూడా నటిస్తుంది. ఖుషి మరోవైపు ది ఆర్చీస్ తర్వాత పెద్ద తెర ఎంట్రీ కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ కామెడీ చిత్రీకరణ దశలో ఉంది. నాదనియాన్ అనే చిత్రంలోను నటించింది.