తంగం చూపుల్లో తడిసి ముద్దయ్యేలా..!

శ్రీదేవి తనయురాలు తెరంగేట్రం అనగానే అటు బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా ఆమె గురించి డిస్కషన్స్ పెట్టారు.

Update: 2024-11-22 00:30 GMT

శ్రీదేవి తనయురాలు తెరంగేట్రం అనగానే అటు బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా ఆమె గురించి డిస్కషన్స్ పెట్టారు. 2018 లో దడక్ తో ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ఒక్కో సినిమా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చింది. ఇక సౌత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ చూసి ఎన్టీఆర్ దేవర సినిమాకు ఓకే చెప్పింది. తెలుగు తెర మీద జాన్వి అందాల ప్రదర్శన దేవర్ 1కు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక దేవర 1 తర్వాత వెంటనే చరణ్ తో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది.

చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో జాన్వి కథానాయికగా నటిస్తుంది. వీటితో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఐతే దేవర తో సౌత్ ఆడియన్స్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ప్రేమను రుచి చూసిన జాన్వి కపూర్ ఇక్కడే వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. ఐతే సినిమాలతోనే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా జాన్వి కపూర్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

చూపు తిప్పుకోలేని విధంగా జాన్వి అందాల జాతర తన ఫాలోవర్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ ఫోటో షూట్ తో జాన్వి అదరగొట్టేస్తుంది. లైట్ కలర్ డ్రస్ తో లూజ్ హెయిర్ వేసుకుని అలా తన ఓర చూపులతో మత్తుజల్లేస్తుంది అమ్మడు. అలా తనను చూస్తూ ఉండిపోవాల్సిందే అనేంతగా అమ్మడి లుక్స్ ఉన్నాయి.

దేవరలో తంగం గా తన అందచందాలతో అదరగొట్టిన జాన్వి కపూర్ ఓ పక్క నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే మరోపక్క గ్లామర్ పరంగా తన స్ట్రెంగ్త్ చూపిస్తుంది. జాన్వి చేసే ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె గ్లామర్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. తెలుగులో తంగం అదే మన జాన్వి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాగా కచ్చితంగా రాబోతున్న సినిమాలతో అమ్మడు మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఈమధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న ఈ టైం లో జాన్వి కపూర్ కూడా ఇక్కడే ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తుంది. అటు సినిమాలు ఇటు ఫోటో షూట్స్ రెండు బ్యాలెన్స్ చేస్తూ జాన్వి దుమ్ముదులిపేస్తుంది.

Tags:    

Similar News