ఎర్రగా బొబ్బలెక్కిన వీపు చూపించిన యువనటి
జాన్వీ కపూర్ ప్రస్తుతం `పరం సుందరి` అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో కథానాయకుడు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం `పరం సుందరి` అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో కథానాయకుడు. ఈ జంట నడుమ ఆన్ లొకేషన్ రొమాన్స్ ఒక రేంజులో వర్కవుట్ అవుతోందట. సినిమా షూటింగ్ లో భాగంగా టీమ్ కొచ్చిలో ఉంది. ఈ సమయంలో జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ బోయ్స్ ని అయోమయానికి గురి చేసింది.
మరీ ఇంతగా ఎండా వానా పట్టించుకోకుండా శ్రమించాలా? వీపు కాలిపోయినట్టు కనిపిస్తోంది. ఎర్రగా కందిపోయింది.. ! ఇది సరికాదేమో..!! అంటూ కొందరు వారించేందుకు ప్రయత్నిస్తున్నారు. నటి జాన్వీ కపూర్ ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్లనే ఎర్రగా బొబ్బలొచ్చాయి. వీపు భాగం ఎర్రగా మారిపోయింది. జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఈ సంగతిని బయటపెట్టింది. సెల్ఫీలో జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. క్యాప్షన్ `బర్న్ట్`అని రాసింది.
జాన్వీ హింట్ ఇవ్వకపోయినా కానీ, కొచ్చిలో సిద్ధార్థ్‌తో కలిసి షూటింగ్ లో ఉందన్న విషయం అర్థమవుతూనే ఉంది. జాన్వీ మాత్రమే కాదు సిద్ధార్థ్ కూడా షూటింగ్ నుంచి గతంలో కొన్ని ఫోటోలను విడుదల చేయగా వైరల్ అయ్యాయి. ఓ చక్కని ప్రేమకథా చిత్రంలో ఈ అందమైన జంట నటిస్తోంది. కేరళలోని ఉత్కంఠభరితమైన బ్యాక్ వాటర్స్ నేపథ్యంలో ని ప్రేమకథ ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతుందని టీమ్ చెబుతోంది. ఇందులో సిద్ ఉత్తర ఢిల్లీ బాలుడి పాత్ర పోషించాడు. కథానాయికతో హీరో సంఘర్షణ రక్తి కట్టిస్తుందట.