జాన్వీ కపూర్.. దేవరతో పాటు మరొకటి

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.

Update: 2024-09-26 13:30 GMT

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని ఇప్పటివరకు ఆమె నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే కాలేదు. అయినప్పటికీ కూడా అమ్మడు తన బ్యాక్ గ్రౌండ్ తో మంచి అవకాశాలు అందుకుంటోంది. గ్లామర్ పరంగా అయితే జాన్వీకి యూత్లో మంచి క్రేజ్ ఉంది.

సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నటన పరంగా జాన్వీ ఇంకా తనను తాను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు దేవర సినిమాతో ఆమెకు ఒక మంచి అవకాశం అయితే లభించింది. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆమె భవిష్యత్తుకు ఒక మంచి దారి దొరికినట్లు అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ తంగం అనే పాత్ర చేసింది.

ఈ క్యారెక్టర్ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అమ్మడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక రేపటితో ఉమ్మడి భవిష్యత్తు ఏంటీ అనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. అయితే దేవరతో పాటే మరొక ఫ్లాప్ సినిమాతో కూడా రేపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ గా మారబోతోంది. ఆమె నటించిన ఉలాజ్ మూవీ ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.

అంతగా నెగటివ్ టాక్ అందుకుని, టక్కున మాయమైపోయింది. ఇక ఇప్పుడు అదే సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో కూడా రావడానికి సిద్ధమయింది. రేపు దేవర తో పాటు ఈ సినిమాను కూడా ఓటీటీ లో దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేకర్స్ టైమ్ తీసుకుని మంచి బజ్ ఉన్న టైమ్ లో ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నట్లు అనిపిస్తోంది.

అయితే దేవర హడావుడిలో దీన్ని ఎంతవరకు పట్టించుకుంటారు అనేది చూడాలి. ఆ సినిమాలో కూడా జాన్వి నటన అంతా గొప్పగా ఏమీ క్లిక్ అయితే కాలేదు. కాబట్టి ఓటీటీలో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఇక దేవర సినిమా మాత్రం తప్పకుండా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా ఫలితం బాగుంటేనే జాన్వీకి కాస్త సౌత్ లో క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటివరకు అమ్మడు ఒక రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో మరిన్ని అవకాశాలు రావాలి అంటే తప్పకుండా పవర్ఫుల్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News