జాన్వీ.. ఇదేం ఎక్స్‌ప్రెషనో..
రైడ్ వైన్ కలర్ బాడీ కాన్ డ్రెస్సులో అదరగొట్టేసిన ముద్దుగుమ్మ.. ఇప్పటికే తన సెలబ్స్ కు సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేసింది.
హీరోయిన్ జాన్వీ కపూర్.. క్రిస్మస్ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. రైడ్ వైన్ కలర్ బాడీ కాన్ డ్రెస్సులో అదరగొట్టేసిన ముద్దుగుమ్మ.. ఇప్పటికే తన సెలబ్స్ కు సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అందులో కిర్రాక్ గా ఉన్న అమ్మడు.. అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి.
తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, చెల్లి ఖుషీ కపూర్, అన్న అర్జున్ కపూర్, ఫ్రెండ్ రాధికా అంబానీ మర్చంట్ సహా పలువురితో జాన్వీ క్రిస్మస్ ను జరుపుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అందరితో దిగిన పిక్స్ ను ఇప్పటికే పోస్ట్ చేయగా.. జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సోలోగా దిగిన ఫోటోస్ చూసిన నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు.
సింపుల్ నెక్ సెట్ వేసుకున్న అమ్మడు.. క్లీవేజ్ షో చేసి మైండ్ బ్లాక్ చేసేసింది. తాజాగా మరిన్ని పిక్స్ బయటకొచ్చాయి. అందులో జాన్వీ సరికొత్త ఎక్స్ప్రెషన్ ఇవ్వగా.. ఆ ఫోటో వైరల్ గా మారింది. ఓవైపు హీట్ పుట్టించేలా.. మరోవైపు క్రేజీగా అమ్మడు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిక్ సూపర్ గా ఉందని సందడి చేస్తున్నారు.
అదే సమయంలో సెలబ్రిటీల మీద చేయి వేసి, ఫోటోలకు ఫోజులు ఇచ్చి మంచి పాపులర్ అయిన ఓర్రీ కూడా ఆ పిక్స్ లో ఉన్నాడు. జాన్వీ కపూర్ తో కలిసి ఓర్రీ చేసిన సందడి మామూలుగా లేదు. వేరే లెవెల్ లో పిక్స్ దిగి చిల్ అయినట్లు కనిపిస్తున్నారు. జాన్వీ, ఓర్రీ సహా గ్యాంగ్ అంతా పబ్ లో ఎంజాయ్ చేసినట్లు అర్థమవుతోంది.
ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా దేవర మూవీతో టాలీవుడ్ మూవీ లవర్స్ కు హాయ్ చెప్పేసింది. ఫస్ట్ పార్ట్ లో ఆమె రోల్ కు స్కోప్ తక్కువే ఉన్నా.. తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది.
అదే సమయంలో జాన్వీ యాక్ట్ చేస్తున్న పరమ సుందరి గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అవ్వగా.. అందులో కూడా చీరకట్టుతో సందడి చేసింది జాన్వీ కపూర్. వచ్చే ఏడాది ఆ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఆ మూవీతో పాటు మరో హిందీ సినిమాలో కూడా భాగమైన జాన్వీ.. ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.