ఎన్టీఆర్‌, జాన్వీ రొమాన్స్‌కి ఏర్పాట్లు !

విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ను ముగించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.

Update: 2024-07-29 10:30 GMT

ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర సినిమా పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రెండు పార్ట్‌ లుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ ను సెప్టెంబర్‌ 27న విడుదల చేయబోతున్నారు.

విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ను ముగించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఇప్పటికే కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలతో పాటు టాకీ పార్ట్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రొమాంటిక్ నెంబర్‌ కి రెడీ అవుతున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్ ది రికార్డ్‌ మీడియాతో చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ఒక భారీ సెట్‌ లో ఎన్టీఆర్‌ మరియు జాన్వీ కపూర్‌ మధ్య రొమాంటిక్ సాంగ్‌ ను చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం సెట్‌ చివరి దశ వర్క్ జరుగుతుందట. ఈ మధ్య కాలంలో డ్యూయెట్‌ సాంగ్స్ ఎక్కువ రావడం లేదు. ఈ పాట ఆ లోటును తీర్చే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్‌ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న దేవర పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో షూట్‌ చేయబోతున్న పాట కూడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు డాన్స్ చేసే విధంగా ఉండబోతుందని అంటున్నారు.

Tags:    

Similar News