ఎవరీ దేవత అంటే..ఆవిడ నీ దేవతే అంటున్నారా?
దీంతో జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా కూడా లైన్ లోకి వచ్చాడు.
'దేవర'లో 'చుట్టమల్లే' సాంగ్ ఇప్పడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాటలో జాన్వీకపూర్-తారక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అంతకు మించి జాన్వీని పాటలో ఎంతో అందంగా హైలైట్ చేసారు. ఓకొత్త జాన్వీనే తెరపై చూస్తున్నట్లు ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన బీటీఎస్(బిహైండ్ ది సీన్) వీడియోను జాన్వీ షేర్ చేసింది. అది నెట్టింట వైరల్ గా మారింది.
నెటి జనులు ఆ వీడియోకి ఎవరి స్టైల్లో వారు కామెంట్లు పెడుతున్నారు. దీంతో జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా కూడా లైన్ లోకి వచ్చాడు. ఆ వీడియో ను లైక్ చేసి! `ఎవరీ దేవత`? అని కామెంట్ పెట్టాడు. దీంతో కొందరు ఆవిడ నీ దేవతే అంటూ శిఖర్ పహారియా పోస్ట్ కి రిప్లై ఇస్తున్నారు. జాన్వీ కపూర్-శిఖర్ పహారియా కొంత కాలంగా క్లోజ్ గా మూవ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇద్దరు ప్రేమికులుగా చెట్టా పాట్టాలేసుకుని తిరిగి దొరికిన సందర్భాలెన్నో. శిఖర్ పహారియాకి జాన్వీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్నది కూడా ఓ టాక్ షోలో రివీల్ చేసిన సంగతి తెలిసిదే. ఈ మధ్యనే జరిగిన అనంత్ అంబానీ పెళ్లిలోనూ ఈ జోడీ హల్చల్ చేసింది. మూడు రోజుల పాటు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. పెళ్లంతా తమదే అన్నట్లు మూడు రోజులు నవ దంపతులతో కలిసి ఎంజాయ్ చేసారు. ఇక అంబానీ ఇంట ఏర్పాటు చేసిన డాన్సు ప్రొగ్రామ్ లో సైతం పాల్గొని డాన్సులేసి హడావుడి చేసారు.
ఇక జాన్వీ-శిఖర్ పహారియా వేర్వేరు రంగాలకు చెందిన వారు. జాన్వీ నటి కాగా...శికర్ పహారియా బిజినెస్ రంగంలో ఉన్నాడు. ఇద్దరు చిన్న నాటి నుంచి స్నేహితులు. చిన్నప్పుడు మొదలైన స్నేహం ఇప్పుడు ప్రేమ వరకూ దారి తీసినట్లు తెలుస్తోంది.