జాన్వీ జ‌ర్నీ శ్రీదేవి కి రివ‌ర్స్ లోనా? పేర్ల‌ల్ గానా?

ఎన్నో సినిమాల్లో న‌టించి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర వేసారు.

Update: 2024-08-08 01:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి సౌత్ ఇండ‌స్ట్రీని ఏలిన త‌ర్వాత బాలీవుడ్ కి వెళ్లింది. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఓ వెలుగు వెలిగిన త‌ర్వాత హిందీ కి వెళ్లారు. సౌత్ క్రేజ్ తోనే శ్రీదేవి హిందీలో అవ‌కాశాలు అందుకుని అక్క‌డా పెద్ద స్టార్ అయ్యారు. అట‌పై నిర్మాత బోనీ క‌పూర్ ని వివాహం చేసుకుని ముంబైలోనే స్థిర‌ప‌డ్డారు. ఎన్నో సినిమాల్లో న‌టించి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర వేసారు.

అయితే డాట‌ర్ జాన్వీ కపూర్ కెరీర్ ప్ర‌స్థానం మాత్రం మామ్ కి రివ‌ర్స్ లో జ‌రుగుతుంది! `ధ‌డ‌క్` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా ఇంత వ‌ర‌కూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది లేదు. యావ‌రేజ్ గా ఆడ‌టం..డివైడ్ టాక్ తెచ్చుకోవ‌డం త‌ప్ప జాన్వీ మార్క్ హిట్ అని ఒక్క సినిమాపై ప‌డ‌లేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `ఉల‌ఝ్` కూడా అలాంటి ఫ‌లితమే సాధిస్తుంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అమ్మ‌డు టాలీవుడ్ లో దేవ‌ర తో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కూడా. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది. హిట్ అయిందం టే జాన్వీ సౌత్ లో ఓవ‌ర్ నైట్ లో పెద్ద స్టార్ అయిపోతుంది. దీంతో ఇక్క‌డి చిత్రాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తోంది. `దేవ‌ర` లో లైన్ లో ఉండ‌గానే రామ్ చ‌ర‌ణ్ తో ఛాన్స్ అందుకుంది.

ఇంకా అమ్మ‌డు ఒకే చెప్పాలి గానీ చాలా మంది క్యూలో ఉన్నారు. ఇదంతా ఒక వెర్ష‌న్ అయితే జాన్వీ ఇక్క‌డ హిట్ అందుకుని మ‌ళ్లీ బాలీవుడ్ కి వెళ్తే! మామ్ త‌ర‌హాలోనే అక్క‌డ రీలాంచ్ అవుతున్న‌ట్లు. ఇంత‌వ‌ర‌కూ హిట్ లేని నేప‌థ్యం..ఇక్క‌డ విజ‌యం అందుకుని అక్క‌డ కొత్త సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటే? మామ్ సెంటిమెంట్ నే జాన్వీ రిపీట్ చేసిన‌ట్లు అవుతుంది. మ‌రి జాన్వీ ప్ర‌యాణం మామ్ కి రివ‌ర్స్ లో ఉందా? పేర్ల‌ల్ గా ఉంటుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News