పిక్ టాక్ : అందాల మెరుపులు కురిపిస్తున్న జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది.

Update: 2024-06-26 07:09 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. జాన్వీకి వరుస ఆఫర్లు దక్కుతున్నాయి కానీ హీరోయిన్‌ గా మాత్రం ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ దక్కలేదు. కమర్షియల్‌ హీరోయిన్‌ గా నటించడంతో పాటు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా ఈ అమ్మడు చేసింది.


జాన్వీ కపూర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ కు జోడీగా దేవర సినిమా ను చేస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా రెండు పార్ట్‌ ల్లో రాబోతుంది. ఆ రెండు పార్ట్‌ ల్లో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

మరో వైపు రామ్‌ చరణ్ కి కూడా జోడీగా ఈ అమ్మడు నటించేందుకు రెడీ అవుతుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. మొదటి సినిమా ఉప్పెన తో కృతి శెట్టికి స్టార్‌ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన బుచ్చి బాబు కచ్చితంగా జాన్వీ కపూర్ ను ప్రేక్షకులు కోరుకునే విధంగా అందంగా చూపించడం ఖాయం.

సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్ సందడి కొనసాగుతూనే ఉంది. అందాల ఆరబోత ఫోటోలతో నెటిజన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మరోసారి క్లీవేజ్ షో అందాలతో మతి పోగొడుతోంది. నడుము అందాలను చూపిస్తూ, కసిగా చూస్తున్న జాన్వీ కపూర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

అతిలోక సుందరి శ్రీదేవి కి అసలైన వారసురాలు జాన్వీ కపూర్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూస్తూ తెగ మురిసిపోతున్నారు. ముందు ముందు టాలీవుడ్‌, బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా జాన్వీ కపూర్ మంచి గుర్తింపును దక్కించుకుని పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News