జాన్వీ సోలో యుద్ధం.. ఈసారైనా క్లిక్కయ్యేనా..

ఉలజ్ మూవీతో జాన్వీ కపూర్ కి కమర్షియల్ సక్సెస్ లభిస్తే బాలీవుడ్ మార్కెట్ లో ఆమె ఇమేజ్ పెరుగుతుంది. ఇది దేవర సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Update: 2024-08-01 16:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ధఢక్ తో ఈ బ్యూటీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీకి ఈ సినిమా చాలా ఉపయోగపడింది. ఆ తరువాత ఘోస్ట్ స్టోరీస్ అనే ఆంథాలజీలో జాన్వీ కపూర్ నటించింది. అలాగే గుంజన్ సక్సేనా బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించింది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. తరువాత రోహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాలు జాన్వీ కపూర్ చేసింది.

ఈ సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అందం, అభినయం ఉన్న కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం జాన్వీ కపూర్ ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై జాన్వీ కపూర్ చాలా హోప్స్ పెట్టుకుంది.

అంతకంటే ముందు జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ పడితే మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. జాన్వీ ఇమేజ్ పెంచుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది. ఆగష్టు 2న జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన ఉలజ్ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. నిజానికి ఈ సినిమాలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. అయితే జాన్వీ కపూర్ ఇమేజ్ మీదనే మూవీ బిజినెస్ జరిగిందంట. సుధాన్షు సారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

ఉలజ్ మూవీతో జాన్వీ కపూర్ కి కమర్షియల్ సక్సెస్ లభిస్తే బాలీవుడ్ మార్కెట్ లో ఆమె ఇమేజ్ పెరుగుతుంది. ఇది దేవర సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. హిందీలో ఉలజ్ కి పోటీగా అజయ్ దేవగన్ మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొస్తున్న కమర్షియల్ ఏ స్థాయిలో ఆదరణ అందుకుంటుందనేది చెప్పలేం. ఉలజ్ మూవీపైన పాజిటివ్ వైబ్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో కూడా కమర్షియల్ చిత్రాలలో జాన్వీ కపూర్ కి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

లేదంటే మరల సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే దేవర మూవీనే ఆమె భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. దేవర మూవీ లైన్ లో ఉండగానే RC16లో కూడా రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయిపొయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానుంది. అలాగే నానికి జోడీగా ఓ సినిమాలో జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. హిందీలో ఉలజ్ మూవీ సక్సెస్ కాకుంటే మరల స్ట్రైట్ హిందీ సినిమాతో హిట్ అందుకోవడానికి జాన్వీ కపూర్ మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే. సన్నీ శంకర్ కి తులసి కుమారి అనే మూవీని జాన్వీ హిందీలో చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందంట.

Tags:    

Similar News