కేకలేస్తూ చెల్లి గదివైపు పరుగు తీసాను!
అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త తో ప్రేక్షకులకు ఎంతటి షాక్ కి గురయ్యారో తెలిసిందే
అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త తో ప్రేక్షకులకు ఎంతటి షాక్ కి గురయ్యారో తెలిసిందే. దుబాయ్ లో ప్రమాదవ శాత్తు బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిందన్న వార్త ఒక్కసారిగా నమ్మలేని నిజంలా మారి పోయింది. ఇదంతా నిజమేనా? అని అంతా షాక్ అయ్యారు. మరి ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఎంతటి విస్మయానికి గురై ఉంటారో? చెప్పాల్సిన పనిలేదు. సగటు అభిమానే ఎంతో నమ్మలేని నిజాన్ని ఆ కుటుంబం చెవిన పడితే? ఇంకెలాంటి క్షోభకి గురవుతారో? చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా ఆ నాటి క్షణాల్ని 'కాఫీ విత్ కరణ్' టాక్ షో వేదికగా జాన్వీకపూర్..ఖుషీ కపూర్ గుర్తు చేసుకున్నారు. 'ఆ సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను నా గదిలో ఉన్నాను. పక్క గది నుంచి ఏడుపు వినిపించింది. నేను పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఖుషీ గదిలోకి వెళ్లాను. నాకు బాగా గుర్తు. ఆ సమయంలో ఖుషీ నా వైపు చూసి ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది. ఆమె నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం ప్రారంభించింది. ఎప్పుడూ ఖుషీని అలా ఎడవటం చూడలేదు' అని జాన్వా తెలిపింది.
'నేను స్ట్రాంగ్ గా ఉంటాను అని అంతా అనుకుంటారు. వాళ్లు అలా భావించడం వల్లే నేను అలా ఉండగ ల్గుతున్నాను' అని ఖుషీ కపూర్ తెలిపింది. అమ్మ మరణించిందన్న వార్త తెలిసిన తర్వాత ఖుషీ కపూర్ అక్కని ఆ రకంగా ఓదార్చింది. ఆ సమయంలో ఖుషీ కపూర్ ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించింది. ఇలా ఉండటం అన్నది జాన్వీకపూర్ కి చేత కాదుట. ఓ పాత ఇంటర్వ్యూలో చెల్లిలో స్ట్రాంగ్ నెస్ గురించి ఇలా చెప్పుకొచ్చింది.
'అమ్మ వదిలివెళ్లాక ఆ స్థానం నా చెల్లెలు ఖుషి తీసేసుకుంది. అమ్మలేని లోటు ప్రస్తుతం నాకు లేదు. నాది అమ్మ పోలిక.. ఖుషీది మా అమ్మమ్మ పోలిక. అందుకే ఖుషీ అంటే అమ్మకు ఎక్కువ ఇష్టం. ‘ఇది మా అమ్మ’ అంటూ ఎప్పుడూ అంటూ ఉండేది. ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ పోలికలతో ఉన్న నాకు అమ్మమ్మ పోలికలతో ఉన్న ఖుషి అమ్మ అయింది. ఇదే యాదృ చ్ఛికం అనుకుంటే. మా ఇద్దరి ఇష్టాయిష్టాలు అమ్మకు బాగా తెలుసు.
అందుకే ఏ విషయంలోనూ మాకు లోటుండేదికాదు. దానికి కారణం ఖుషి. అయితే.. తన ఇష్టాయిష్టాలు నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నేను తనని పట్టించుకోను. కానీ తను విశాలంగా ఆలోచించే మనిషి. నాకంటే మూడేళ్లు చిన్నదైనా తనకు పరిపక్వత ఎక్కువ. అందుకే తనెప్పుడూ బాగానే ఉంటుందన్నది నా నమ్మకం' అని జాన్వా తెలిపింది.