ఖుషీ ఖుషీగా జాలీ జాన్వీ ఎందాకా ఈ పయనం?
ఆ ఇరువురి సోషల్ మీడియాలు వారి అనుబంధాన్ని స్పష్టంగా చెబుతుంటాయి.
కపూర్ సిస్టర్స్ అన్యోన్యత అనురాగాలు అందరికీ స్ఫూర్తి. అక్క కోసం చెల్లి .. చెల్లి కోసం అక్క ఎంతటి త్యాగానికి అయినా వెనకాడరు. ఇక తన సోదరి ఖుషీ విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళితే తనని వదిలి క్షణమైనా ఇండియాలో ఉండలేకపోయేది జాన్వీ. వెంటనే విమానం టికెట్లు రెడీ చేయించుకుని విదేశాలకు ఎగిరిపోయేది.
ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. జాన్వీకపూర్ - ఖుషీ కపూర్ సిస్టర్స్ అనుబంధం గురించి నిజానికి పరిచయమే అవసరం లేదు. ఆ ఇరువురి సోషల్ మీడియాలు వారి అనుబంధాన్ని స్పష్టంగా చెబుతుంటాయి.
జాన్వీ ఇప్పటికే బాలీవుడ్ ని ఒక స్టార్ గా ఏల్తోంది. హిందీ చిత్రసీమతో పాటు టాలీవుడ్ లోను తనకు ఫాలోవర్స్ అమాంతం పెరుగుతున్నారు. దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్ కి పరిచయమవుతోంది. కెరీర్ పరంగా తనకు ఎలాంటి డోఖా లేదని జాన్వీ నిరూపిస్తోంది. మరోవైపు ఖుషీ కపూర్ కూడా నటిగా ఆరంగేట్రం చేస్తోంది.
గల్లీబోయ్ ఫేం జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న 'ది ఆర్చీస్' ఓటీటీ సిరీస్ లో నటిస్తోంది. మునుముందు అక్కను మించిన చెల్లి అని నిరూపించుకోవడానికి ఖుషీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక తన సోదరిని కూడా పెద్ద స్టార్ ని చేసేందుకు జాన్వీ తనకు ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ఖుషీకి అవసరమైన టిప్స్ ని అందిస్తోంది. నటనలో మెళకువలు నేర్పిస్తోందిట.
ఇక కూతుళ్లు ఇద్దరినీ స్టార్లుగా తీర్చిదిద్దడంలో బోనీకపూర్ ఎప్పుడూ బిజీగా ఉన్నారు. ఆయన అన్నిటా ప్రణాళికా బద్ధంగా ప్రతిదీ అందుబాటులోకి తెస్తూ కుమార్తెల కెరీర్ కి సహకరిస్తున్నారు. పాపా బోనీ కమ్యూనికేషన్ అక్కా చెల్లెళ్ల ఎదుగుదలకు సహకరిస్తోంది. పరిశ్రమలో కరణ్ జోహార్- మనీష్ మల్హోత్రా సహా స్టార్ డైరెక్టర్ల అండదండలు శ్రీదేవి-బోనీ జంట వారసులకు పుష్కలంగా ఉన్నాయి. నటవారసత్వం బంధుప్రీతి కపూర్ సిస్టర్స్ కి ఎప్పుడూ ప్లస్ అనే భావించాలి.