కష్టకాలంలో తనే అండగా నిలబడింది: జానీ మాస్టర్

ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తన భార్య పైన ప్రశంసలు కురిపించారు.

Update: 2024-11-19 04:38 GMT

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జైలు జీవితం అనుభవించి బెయిల్ పైన బయటకి వచ్చారు. చాలా రోజుల తర్వాత జానీ మాస్టర్ మరల మీడియా ముందుకొచ్చారు. రాకింగ్ రాకేష్ నటించి నిర్మించిన ‘కేశవ చంద్ర రమావత్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి జానీ మాస్టర్ అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తన భార్య పైన ప్రశంసలు కురిపించారు.

ప్రతి భర్త వెనుక కష్టం, నష్టంలో భార్య అండగా నిలబడుతుంది. ఆమె పవర్, దీవెన కచ్చితంగా ఉంటుంది. అంత కచ్చితంగా ఎలా చెబుతున్నానంటే కొంతకాలంగా నేను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ లో నా భార్య నాకు వెన్నెముకలా నిలబడింది. అందుకే ఆమెని అందరి ముందు ప్రశంసిస్తున్నాను. ఆమె నాపై నమ్మకంతో, ఒక స్థంభంలా నాకు అండగా నిలబడ్డారు. ప్రతి భర్త వెనుక ఉన్న భార్యలకి ఈ సందర్భంగా చెబుతున్నాను.

మీరు ఒక తల్లిగా, ఫ్రెండ్ గా భర్త వెనుక నిలబడి వారిని సరైన మార్గం వైపు తీసుకొని వెళ్తున్నారు. అలాగే రాకేష్ వెనుక కూడా అతని భార్య సుజాత బలంగా నిలబడ్డారు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే భార్యగా భర్తల వెనుక నిలబడి వారికి ధైర్యం ఇస్తున్న ప్రతి మహిళకి థాంక్స్ చెబుతున్నాను అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే కష్టకాలంలో చాలా మంది నాకు సపోర్ట్ గా నిలబడి మాట్లాడారు. వారందరికి కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని జానీ మాస్టర్ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. రాకేష్ కష్టపడి చేసిన ఈ కేసీఆర్ మూవీ విజయవంతం కావాలని కోరారు. లైంగిక వేధింపుల కేసు ఘటన తర్వాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది.

మీడియాలో కూడా భిన్నమైన కథనాలు వచ్చాయి. అలాంటి సమయంలో జానీ మాస్టర్ కి అతని భార్య అండగా నిలబడింది. జానీ మాస్టర్ కోసం రోడ్డు మీదకొచ్చి పోరాడింది. నా భర్త ఏ తప్పు చేయలేదని గట్టిగా చెప్పింది. జైలు నుంచి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి అలా కొద్ది రోజులు వెకేషన్ కి వెళ్లి వచ్చారు. మరల ఇప్పుడు మూవీ ఈవెంట్ ద్వారా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

Tags:    

Similar News