జ‌పాన్..చైనా నుంచి 'జైల‌ర్' కోసం జంట‌లు!

'జైల‌ర్' చిత్రాన్ని రిలీజ్ రోజున తొలి ఆట చూడాల‌ని జ‌పాన్ దంప‌తులు చెన్నైకి వ‌చ్చి చూసారు.

Update: 2023-08-10 10:22 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌విదేశాల్లో అభిమానుల్లో స్టార్ అత‌ను. భారత్ తో పాటు చైనా..థాయ్ లాండ్...జపాన్..మ‌లేషియా స‌హా చాలా దేశాల్లో భారీ అభిమానులు సంపాదించిన తొలి స్టార్. భార‌త్ లో ఎంత మంది న‌టులున్నా సూప‌ర్ స్టార్ స్టైల్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ర‌జ‌నీ న‌టించిన ఏ సినిమా అయినా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

హిట్ టాక్ వ‌స్తే బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీ త‌ప్ప‌దు. తాజాగా నేడు ర‌జ‌నీ న‌టించిన 'జైల‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం చైనా..జ‌పాన్ నుంచి ఏకంగా జంట‌లే చెన్నై కి వ‌చ్చి సొంత గడ్డ‌పై జైల‌ర్ వీక్షించారంటే? న‌మ్ముతారా? అంటే న‌మ్మాల్సిన నిజ‌మిది. 'జైల‌ర్' చిత్రాన్ని రిలీజ్ రోజున తొలి ఆట చూడాల‌ని జ‌పాన్ దంప‌తులు చెన్నైకి వ‌చ్చి చూసారు.

షో అనంత‌రం సినిమా బాగుంద‌ని ప్ర‌శంసించారు. అలాగే చైనా నుంచి ఓ జంట కూడా వీక్షించారు. సూప‌ర్ స్టార్ స్టైల్ కి ఫిదా అయిన‌ట్లు తెలిపారు. ఇంకా ప‌లు దేశాల నుంచి బారత్ కి వ‌చ్చి వివిధ రాష్ట్రాల్లో జైల‌ర్ చిత్రాన్ని వీక్షించారు. ఇలా శ‌త్రు దేశ‌మైనా చైనా నుంచి కూడా ఇండియాకొచ్చి ర‌జ‌నీ సినిమాలు వీక్షిస్త‌న్నారంటే? వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవ‌చ్చు. ఇండియాలో ఏ స్టార్ సినిమాకి ఇలాంటి హంగామా క‌నిపించ‌దు.

విదేశీయులు ఇండియా వ‌చ్చి సినిమా చూడ‌టం అన్న‌ది గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పాలి. అప్ప‌ట్లో జ‌పాన్ నుంచి ప్ర‌భాస్ అభిమానులు కొంద‌రు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇంటికొచ్చి విష్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే రానా బ‌ర్త్ డేకి ఈ హంగామా క‌నిపించింది. అయితే వీరంతా ఇండియాలో ఉద్యోగాలు చేసే విదేశీయు. ఇలాంటి వారు హైద‌రాబాద్ లో చాలా మంది ఉన్నారు. కానీ ర‌జ‌నీ సినిమా చూడ‌టం కోసం మాత్రం ప్ర‌త్యేకంగా సొంత దేశాల నుంచి వ‌చ్చిన వారే వీరంతా.

Tags:    

Similar News