ఇండియాలో సత్తా చాటుతోన్నపరాయి నటుడు!
కానీ ఐర్లాండ్ కి చెందిన జేసన్ షా భారతీయ పరిశ్రమలో స్థిరపడ్డాడు? అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును ఇది పచ్చి నిజం.
సొంత పరశ్రమలో అవకాశాలు రావడమే కష్టం. అందుకే టాలీవుడ్ కాకపోతే కోలీవుడ్...ఆ రెండు లేకపోతే బాలీవుడ్ అనో..శాండిల్ వుడ్ అనో..మాలీవుడ్ అనో దేశంలో ఉన్న ఏదో పరిశ్రమలో అవకాశాల కోసం ఔత్సాహికులంతా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రోసస్ లో సక్సెస్ అయిన వాళ్లకంటే ఫెయిలైన వారే ఎక్కువ. సినిమాల్లో కాంపిటీషన్ తట్టుకుని నిలవడం అంత ఈజీ కాదు. ఎంతో కృషి పట్టుదల ఉన్నా అదృష్టం కూడా కలిసి వస్తేనే రాణించడానికి అవకాశం ఉంటుంది.
భారతదేశంలో పుట్టిన వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే? ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవాలంటే? అది జరిగేది కాదమ్మా? అనేస్తామంతా. కానీ ఐర్లాండ్ కి చెందిన జేసన్ షా భారతీయ పరిశ్రమలో స్థిరపడ్డాడు? అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును ఇది పచ్చి నిజం. అంతే కాదు అతడు హిందీతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జేసన్ షా అమెరికా న్యూయార్క్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. పుట్టి పెరిగింది ఐర్లాండ్ లో . కానీ సినిమాలంటే ఆసక్తి. దీంతో ఇండియాకి వచ్చి సీరియల్స్ లో ఛాన్సులు అందుకున్నాడు. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. కోలీవుడ్ లో '1947 ఆగస్టు 16', 'కన్జూరింగ్ కన్నప్పన్', 'మిషన్ చాప్టర్ వన్' లాంటి చిత్రాల్లో నటించాడు.
ఇటీవల రిలీజ్ అయిన భన్సాలీ 'హీరామండి'లోనూ నటించాడు. ఆ మధ్య రిలీజ్ అయిన తెలుగు సినిమా 'సలార్' లో కూడా నటించాడు. ప్రస్తుతం అలియాభట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'జిగ్రా'లోనూ నటిస్తున్నాడు. హాలీవుడ్ లో అవకాశాలు ఇంతకంటే కష్టంగా ఉంటాయి. అందుకే జేసన్ షా నేరుగా ఇండియాకొచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.