ముంబైలో స్టార్ రైటర్ భారీ పెట్టుబడులు
ఇప్పుడు అతడు జుహులో రూ.7.76 కోట్ల విలువైన మరో ఆస్తిని కొనుగోలు చేశాడు.
ఇటీవల పలువురు అగ్ర కథానాయకులు, కథానాయికలు ముంబైలోని ఖరీదైన అపార్ట్ మెంట్లలో పెట్టుబడులు పెట్టారని కథనాలొచ్చాయి. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ సహా పలువురు స్టార్లు ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఫ్లాట్లు కొన్నారు. నవతరం కథానాయిక ట్రిప్తీ దిమ్రీ ముంబై బాంద్రాలో ఖరీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిందని కథనాలొచ్చాయి.
ఇటీవల రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్న ప్రముఖుల్లో ప్రముఖ వెటరన్ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ పేరు చేరింది. ఇప్పుడు అతడు జుహులో రూ.7.76 కోట్ల విలువైన మరో ఆస్తిని కొనుగోలు చేశాడు. స్క్వేర్‌యార్డ్స్ యాక్సెస్ చేసిన.. సమీక్షించిన పత్రాల ప్రకారం... వెటరన్ స్క్రీన్ రైటర్ , గేయ రచయిత జావేద్ అక్తర్ ముంబైలోని ఉన్నత స్థాయి జుహు పరిసరాల్లో రూ. 7.76 కోట్లకు ఆస్తిని కొనుగోలు చేశారు.
రెడీ టు-మూవ్ ఇన్ ప్రాపర్టీ సుమారు 1199.42 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జూలై 2న ముగిసిన ఈ లావాదేవీలో స్టాంప్ డ్యూటీ రూ.46.02 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000. ఈ ఆస్తి ముంబైలోని జుహులోని సాగర్ సామ్రాట్ భవనంలో ఉంది. ఇది అనేక ఇతర విలాసవంతమైన ప్రముఖుల ఇండ్లకు సమీపంలో ఉంది.
స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం,.. అక్తర్ 2021లో రూ. 7 కోట్లతో 1218.47 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదే చోట ఉన్న అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసాడు. అతను ప్రస్తుతం ఈ సహకార హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. వేరే అంతస్తులో (ఈ రెండు ఆస్తులు కాకుండా) అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.
హిందీ తారలు ముంబైలో లగ్జరీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ ఆదాయాలు పెంచుకుంటున్నారు. ఇటీవల లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలో చాలా మంది స్టార్లు భారీగా ఆస్తులు కొన్నారు. జూన్ 25న నటుడు అమీర్ ఖాన్ ముంబైలోని పాలి హిల్‌లోని అపార్ట్‌మెంట్‌ను రూ.9.75 కోట్లకు కొనుగోలు చేశారు.
జూన్ 20న అమితాబ్ బచ్చన్ ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్‌లో దాదాపు రూ.60 కోట్లతో మూడు కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశారు. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఉన్నాయి. జూన్ 3న, యానిమల్, బుల్బుల్, ఖలా వంటి చిత్రాలలో పాత్రలతో పాపులరైన ట్రిప్తీ డిమ్రీ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో రూ. 14 కోట్లకు విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేసింది. అభిషేక్ బచ్చన్, అర్జున్ కపూర్, బోనీకపూర్, జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ సహా పలువురు భారీగా రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టారని ఇప్పటికే కథనాలొచ్చాయి.