వీడియో: రాక్షస సంతతితో ఖాన్ జీ సంగమం
ఇదిగో ఇప్పుడు షారూఖ్ ఖాన్ కూడా దక్షిణాది రాక్షస సంతతితో డ్యాన్సులు చేస్తున్నది ఎందుకో గ్రహించగలరా? అట్లీ 'జవాన్' లో ఆయన ఊరమాస్ స్టెప్పులేస్తున్నారు.
భారతదేశంలో ఉత్తరాది వారిని ఆర్యులు లేదా దేవతల అంశతో జన్మించినవారు అంటారు.. అందుకే వారి రూపాలు వేరు.. రంగు ఒడ్డు పొడుగు అన్నీ వేరు.. ఆరడుగుల ఆజానుభాహులుగా కండలు మెలితిరిగి తీరైన రంగు రూపంతో ప్రత్యేకతతో కీర్తి ఘడించారు.
ఇదే సనాతన భారతదేశంలో దక్షిణాది ప్రజల్ని రాక్షస అంశతో జన్మించిన వారిగా చూస్తారు. దానికి తగ్గట్టే రంగు లుక్ అన్నీ వేరుగా ఉంటాయి. సౌత్ అంతా బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ మెరుస్తుంది. ఈ కథలన్నీ పురాణాల నుంచి పుట్టుకొచ్చాయని అంటుంటారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ స్టార్లు అంతా దక్షిణాదిని చిన్న చూపు చూసింది కూడా ఇందుకే.
కానీ ఇప్పుడు పాన్ ఇండియా హిట్టు కోసం ఉత్తరాది స్టార్లు నానా పాట్లు పడుతున్నారు. దక్షిణాది హీరోల్ని దక్షిణాది ప్రతిభను ఉత్తరాదిన ఆదరించడం మొదలు పెట్టినా.. దక్షిణాదిన ఉత్తరాది హీరోల పప్పులు ఉడకకపోవడంతోనే ముప్పు వచ్చింది.
ఈ వైరుధ్యం వల్ల ఉత్తరాది స్టార్లు చాలా పాట్లు పడుతున్నారు. కనీసం ఖాన్ ల త్రయాన్ని అయినా దక్షిణాదిన ఆదరించడం లేదు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ - లాల్ సింగ్ చద్దా.. సల్మాన్ ఖాన్ - కిసీ కా భాయ్ కిసీ కా జాన్ బోల్తా పడ్డాయి. షారూఖ్ పఠాన్ సైతం దక్షిణాది నుంచి కనీసం 50కోట్లు కూడా వసూల్ చేయలేదు.
ఇదిగో ఇప్పుడు షారూఖ్ ఖాన్ కూడా దక్షిణాది రాక్షస సంతతితో డ్యాన్సులు చేస్తున్నది ఎందుకో గ్రహించగలరా? అట్లీ 'జవాన్' లో ఆయన ఊరమాస్ స్టెప్పులేస్తున్నారు. ఇంతకుముందులా కేవలం వైట్ కలర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్లు లేరు ఈ పాటలో.. పక్కా రాక్షస సంతతికి చెందిన తమిళ ఊర మాస్ కళాకారులు మాత్రమే డ్యాన్సులు చేస్తున్నారు ఖాన్ జీ పాటలో..!! ఇంతలోనే ఎంత మార్పు.. ?మునుముందు బాలీవుడ్ స్టార్లు ఇంకా దిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
జవాన్ ప్రమోషన్స్ కోసం ఖాన్ జీ దక్షిణాది మెట్రోలకు వస్తారని భావిస్తున్నారు. తెలుగు స్టార్లతో పోటీపడుతూ ఆంధ్రా- తెలంగాణలో టూటైర్ సిటీల్లోను తమ సినిమాలను ప్రచారం చేస్తూ ఇకపై ఖాన్ ల త్రయం కూడా ఇక్కడి ప్రజలతో మమేకం అవుతారేమో! తరణ్ ఆదర్శ్ లాంటి క్రిటిక్ కూడా ఇదే కోరుకుంటున్నారు.