మూడు..నాలుగు కార్లలో యువరాణిలా సెట్స్ కి!
ట్రెండ్ కి తగ్గట్టు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్ కనిపిస్తుంటుంది. బాలీవుడ్ తో పోల్చుకుంటే ఈ రకమైన కల్చర్ దక్షణాది నటుల్లో చాలా తక్కువగానే ఉంటుంది.
ట్రెండ్ కి తగ్గట్టు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్ కనిపిస్తుంటుంది. బాలీవుడ్ తో పోల్చుకుంటే ఈ రకమైన కల్చర్ దక్షణాది నటుల్లో చాలా తక్కువగానే ఉంటుంది. వీలైనంత వరకూ సౌత్ హీరోలంతా చాలా నిడారంబరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఆ రకంగా తమలో సింప్లిసిటీని చాటుతుంటారు. ఖరీదైన కార్లలోనే షూటింగ్ లకు వెళ్లాలని గనీ..ఖరీదైన భవంతుల్లోనే నివసించాలని వంటి వాటికి సౌత్ స్టార్లు తొలి నుంచే దూరంగా ఉన్నారు. షూటింగ్ కి వెళ్లడానికి ఏదో ఒక కారు ఉంటే చాలు అని భావిస్తారు.
కానీ అలనాటి దక్షిణాది హీరోయిన్ జయలలిత మాత్రం ఆ రోజుల్లోనే ఏకంగా నాలుగు కార్లలో సినిమా సెట్స్ కి వెళ్లేవారుట. అమ్మ షూటింగ్ కి బయల్దేరుతున్నారంటే వెనుక మంది మార్భలం చాలా హడావుడి ఉండేదిట. మరి ఒక మనిషికి అన్ని కార్లు ఎందుకు? ఉన్నది ఒక నటి? డీజీల్ దండగా? అనుకుంటే పొరబడినట్లే...బండెనకబండి కట్టడం వెనుక ఓఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉంది.
తాజాగా ఈ విషయాన్ని కళా తపస్వీ కె. విశ్వనాథ్ దగ్గర అనేక సినిమాలకు పని చేసిన జయకుమార్ రివీల్ చేసారు. `డాక్టర్ బాబు` సినిమా షూటింగుకి జయలలిత మూడు నాలుగు కార్లలో ఒక యువరాణిలా వచ్చేవారు. ఒక కారులో మేకప్ .. కాస్ట్యూమ్స్.. మరో కారులో ఫ్రూట్స్ .. కూలర్ .. ఫ్యాన్.. మరో కారులో నుంచి ఆమె దిగేవారు. ఆమెతో మాట్లాడటానికి ముందుగా శోభన్ బాబుగారే ఆసక్తిని చూపేవారు.
'డాక్టర్ బాబు' సినిమా సమయంలోనే శోభన్ బాబుకి .. జయలలితకు పరిచయమైంది. శోభన్ బాబు గారు నన్ను తమ్ముడూ అని పిలిచేవారు. అప్పారావుగారు అని ఆయన పర్సనల్ మేకప్ మేన్ శోభన్ బాబు కోసం 'రింగ్'తో కూడిన విగ్ సెట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఇక `సంపూర్ణ రామాయణం` సినిమా షూటింగును, `రంపచోడవరం` స్కూల్లో ఉంటూ 'మారేడుమిల్లిలో చేసేవాళ్లం. శోభన్ బాబుగారితో కబుర్లు చెప్పడానికి చంద్రకళ వచ్చినప్పటికీ.. ఆయన రగ్గు కప్పుకుని మా దగ్గరికి వచ్చి మాతో పాటు చలికాచుకుంటూ కూర్చునేవార`ని ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు.