విడాకులు కఠిన నిర్ణయమే..కానీ తొందర పడలేదు! జయం రవి
కోలీవుడ్ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. భార్య ఆరతితో ధాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు నెట్టింట ప్రచారం ఒకానొక దశలో తారా స్థాయిలోనే జరిగింది. ఈ ప్రచారాన్ని జయం రవి కూడా ఖండించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ జయం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయొద్దని జయం రవి కోరారు. దీనికి సంబంధించి ఓ లేఖ విడుదల చేసాడు. ` చాలా ఆలోచనలు ,చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకుంటున్నాను. ఇది కఠినమైన నిర్ణయమే. కానీ ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు. ఎన్నో విషయాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
ఇది వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది అని నేను నమ్ముతున్నాను. జీవితంలో ఓ కీలకమైన అధ్యాయాన్ని ముగించాను. నా అభిమానులు, మీడియా నుంచి సున్నితంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాను. మా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై ఊహాగానాలు, పుకార్లను , ప్రత్యేక కారణాలు పుట్టించొద్దు అని కోరుతున్నా` అన్నారు.
జయం రవి, ఆర్తి 2009 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే 15 ఏళ్ల బంధానికి ఈ జోడీ స్వస్తి పలికింది. ఇద్దరు విడిపోతున్నట్లు ఈ ఏడాది జూన్ లో నెట్టింట ప్రచారంలోకి రావడం విశేషం. పెళ్లైన నెలలోనే విడిపోతున్నట్లు ప్రచారం జరగడం..ఇప్పుడు అది నిజమేనంటూ జయం రవి మీడియా ముందుకు రావడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.