జయం రవి చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో జయం రవి స్పందించారు. 'మా విడాకుల గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.
కోలీవుడ్ నటుడు జయం రవి భార్యతో ఆర్తితో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి జయం సుదీర్ఘమైన ఓ లేఖని మీడియాకి రిలీజ్ చేసాడు. అయితే తన అనుమతి లేకుండా...తనకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విడాకులు ప్రకటించినట్లు ఆర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే జయం రవి ఓ సింగర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో జయం రవి స్పందించారు. 'మా విడాకుల గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నన్ను అర్దం చేసుకున్న వారంతా అర్దం చేసుకున్నారు. వినయం, మర్యాద లేని వాళ్లు మాత్రం ఇష్టారీతున మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించి నా వద్ద ఆధారులున్నాయి. తప్పకుండా కోర్టులో నిరూపించుకుంటా. నిజం బయటపడిన రోజు నా పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
వాటిని ఎదుర్కోవడానికి అంతా సిద్దంగా ఉండండి. నా పేరు , ప్రతిష్టలకు భంగం కలిగించాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు. లాయర్ ద్వారా ఆర్తికి విడాకుల నోటీస్ పంపించాను. ఈ విషయం ఆమె తండ్రికి తెలుసు. ఈ విషయం గురించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్నారు. నేను అందుబా టులో లేనని, వారికి తెలియకుండానే విడాకుల ప్రకటన ఇచ్చానని వాళ్లు ఎలా చెప్పగలుగుతున్నారు? మా పెద్దబ్బాయ్ అవర్ పుట్టిన రోజు జూన్ లో జరిగింది.
సెలబ్రేషన్ల కోసం చెన్నైలో నే ఉన్నాను. దానికి సంబంధించిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి. విడాకులకు సంబంధించి అరవ్ తో మాట్లాడాను. ఆర్తి-నేను కలిసి ఉండాలన్నదే వాడి ఆలోచన. ఆయాన్ ఇంకా చిన్న వాడే. ఈ విషయం అర్దం చేసుకునే వయసు వాడికి లేదు. ఆ సింగర్ నాకెంతో కాలంగా తెలుసు. ఆమె ఒక సైకాలజిస్ట్. మానసిక కుంగుబాటు నుంచి బయట పడేందుకు ఎంతో మందికి సహాయం చేసారు. ఆమెతో కలిసి నేనొక ఆధ్మాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా' అన్నారు.