ఉయ్యాల జంపాల డైరెక్టర్.. ఈసారి రియల్ స్టోరీ!
ఉయ్యాల జంపాల మజ్ను లాంటి లవ్ స్టోరీలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు దర్శకుడు విరించి వర్మ
ఉయ్యాల జంపాల మజ్ను లాంటి లవ్ స్టోరీలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు దర్శకుడు విరించి వర్మ. ఇక అతని నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ దర్శకుడు మధ్యలో కొన్ని కథలపై మీడియం రేంజ్ హీరోలతో గట్టిగానే చర్చలు జరిపాడు. అయితే ఈసారి ఊహించని విధంగా జితేందర్ రెడ్డి అనే ఒక రియల్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
జగిత్యాలలో నుంచి ఢిల్లీ ప్రముఖుల నుండి కూడా ప్రశంశలు అందుకున్న వ్యక్తి గురించి వీరించి వర్మ వెండితెరపై ఒక కథను చూపించడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాకు సంబదించిన పోస్టర్లు టీజర్లు కూడా ఇదివరకే విడుదల చేశారు. ఆ సినిమా విశేషాల గురించి దర్శకుడు ఒక వివరణ ఇచ్చాడు. ఒక వ్యక్తి ధర్మం కోసం దేశం కోసం నిలబడగలిగితే ఏదైనా చేయగలడా తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతైనా చేయొచ్చా అని జితేందర్ రెడ్డి నిరూపించారు ఆయన గురించి తెలుసుకోవడానికి డైరెక్ట్ గా ఆయన పుట్టిన గ్రామంలోకి వెళ్లి సన్నిహితులు అడిగి తెలుసుకున్నాను.
అప్పుడు వారు ఇచ్చిన సమాధానాలు నన్ను ఎంతగానో ఆలోచింపచేశాయి. ఎవరిని అడిగినా జిత్తు అన్న ఇలా, జిత్తు అన్న అలా అని చెప్పారు. లవ్ స్టోరీస్ తీసినా నాకు ఇలాంటి ఒక మంచి కథ చెప్పాలని అనుకున్నాను. ప్రతి అంశం చాలా రియాలిటీగా, ఆ రోజుల్లో ఉన్న ఆతెన్టిక్ ని అలానే చూపించి, టీసర్ ని విడుదల చెయ్యడం చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కొందరు ఇది పొలిటికల్ సినిమానా అని అనుకుంటున్నారు, నిజానికి ఇది పొలిటికల్ సినిమా కాదు. అలా అయితే ఎలక్షన్ కి ముందే రిలీజ్ చేసే వాళ్ళం. జితేందర్ రెడ్డి కథని ఈ తరానికి చిపించాలని అనిపించింది. పాలిటిక్స్ కి ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు. ఒక స్టూడెంట్ లీడర్ నుండి జనం మెచ్చే నాయకుడిగా జితేందర్ రెడ్డి ప్రయాణం ఈ సినిమాలో ఉంటుందని విరించి వర్మ తెలియజేశారు.
సినిమా నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉయ్యాలా జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలతో మెప్పించిన విరించి ఈ జితేందర్ రెడ్డి కథను తెరపైకి ఎలా తీసుకువస్తాడో అని అనుకున్నాను కానీ మా అందరికన్నా విరించి ఈ కథని బాగా అర్థం చేసుకున్నాడు. పక్క రాకేశ్ వర్రే కూడా నటుడిగా ఇదివరకే మంచి కథలో హీరో గా చేశాడు. షూటింగ్ లో అతను నటించిన విధానం చూస్తే నిజంగా జితేందర్ రెడ్డి నే చూసినట్టు అనిపించింది. జితేందర్ రెడ్డి చరిత్రను మొదట ఒక షార్ట్ ఫిలిం గా తీద్దాం అనుకున్నాము. కానీ ఆయన చేసిన పనులు ప్రజలందరికీ తెలియాలంటే సినిమాగా ప్రేక్షకులకు చూపించాలని ఈ సినిమా నిర్మించాం.
హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ.. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన నా కెరీర్ లో హీరోగా సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా, కాని టీజర్ తోనే బాగా రిసీవ్ చేసుకున్నారు. డిఓపి జ్ఞాన శేఖర్ గారే నన్ను ఈ సినిమాకి సజెస్ట్ చేశారు. అప్పటికే రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నా. ఇక ఈ సినిమా కోసం ఆ రెండు పక్కన పెట్టి ఆ డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి విరించి వర్మ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమానే ముందు చేయ్యాలనుకున్నాను అంటూ జితేందర్ రెడ్డి జీవిత కథ వికీపీడియాలో కూడా ఎక్కడా లేకపోవడంతో ఇదొక ఫ్రెష్ కంటెంట్ అని దీనిపైన ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలియజేశారు.