రిలీజ్ కు ముందు పెద్ద రచ్చ.. కానీ రిజల్ట్ మాత్రం!

జర్నలిస్ట్ గా నటించిన జునైద్ ఖాన్ సినిమాలో వేరే లెవల్ లో ఏం యాక్ట్ చేయలేదని, ఆయన నటన యావరేజ్ గా ఉందని చెబుతున్నారు.

Update: 2024-06-22 08:40 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహారాజ్ రిలీజ్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే ఆ చిత్రం వార్తల్లో నిలిచింది. సిద్దార్థ్ మ‌ల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. నిజ‌ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందింది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జూన్ 14వ తేదీ స్టీమింగ్ అవ్వనుందని అనౌన్స్ చేశారు.

కానీ ఈ సినిమా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మూవీ ఉండనుందని, స్ట్రీమింగ్ నిలిపివేయాలని పోస్టులు పెట్టారు. నెట్ ఫ్లిక్స్ ను కూడా బ్యాన్ చేయాలంటూ రచ్చ రచ్చ చేశారు. దీంతో ఆ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత గుజరాత్ కోర్టు మూవీని చూసి మేకర్స్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

రిలీజ్ కు ముందే వివాదాలు జరగ్గా.. సినిమా విడుదల అయ్యాక ఎలా ఉంటుందో చూడాలని అంతా డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు మూవీ ఎలా ఉందో నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. 50 ఏళ్ల క్రితం అంశాన్ని తీసుకున్న డైరెక్టర్.. సరైన రీతిలో వివరించలేకపోయారని చెబుతున్నారు. ఓ విషయాన్ని జర్నలిస్ట్ బయటకు తీసే పాయింట్ బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే క్లిక్ అవ్వలేదని అంటున్నారు. రొటీన్ గానే అనిపించిందని, స్పెషల్ గా సినిమా ఏం లేదని చెబుతున్నారు.

జర్నలిస్ట్ గా నటించిన జునైద్ ఖాన్ సినిమాలో వేరే లెవల్ లో ఏం యాక్ట్ చేయలేదని, ఆయన నటన యావరేజ్ గా ఉందని చెబుతున్నారు. సినిమాలో జైదీప్, శర్వారి బాగా నటించారని కొనియాడుతున్నారు. మొత్తానికి రిలీజ్ కు ముందు ఓ రేంజ్ వివాదాల్లో నిలిచిన మహారాజ్ సినిమా.. ఓటీటీ లవర్స్ ను బాగా నిరాశ పరిచిందన్నమాట. బాలీవుడ్ ఫేమస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో డెబ్యూ ఇచ్చిన జునైద్ ఖాన్.. ఫస్ట్ మూవీతో ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు.

అయితే జునైద్ ఖాన్.. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కొడుకు. 1986లో రీనాను అమీర్ పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత జునైద్ పుట్టాడు. అక్కడికి కొన్నేళ్ల తర్వాత రీనా దత్తా, అమీర్ ఖాన్ విడిపోయిన విషయం తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ నటించిన పలు సినిమాలకు జునైద్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు హీరోగా డెబ్యూతో నిరాశపరిచారు. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. మరి అవేం అవుతాయో చూడాలి.

Tags:    

Similar News