చీరందంలో సీరియ‌ల్ బ్యూటీ సెగ‌లు!

ఇదిగో ఇక్క‌డిలో పువ్వుల చీర‌లో అందంగా ముస్తాబైంది. నుదిటిన స‌న్న‌ని చిన్న బొట్టు..పెదాల‌కు లిప్ స్టిక్ లైట్ మ్యాక‌ప్ తో అందంగా క‌నిపిస్తుంది.

Update: 2023-12-05 11:30 GMT

సీరియ‌ల్ బ్యూటీ జ్యోతిరాయ్ ఇన్ స్టా సంచ‌ల‌నాలు ఏ రేంజ్ లో? రేపుతోందో తెలిసిందే. సీరియ‌ల్స్ లో అత్త పాత్ర‌లు..అమ్మ పాత్ర‌లు పోషించినా బ‌య‌ట మాత్రం నాటీ బ్యూటీగా ఫేమ‌స్ అవుతుంది. న‌వ నాయిక‌ల‌కు ఏ మాత్రం త‌క్కువ కాద‌ని..అంత‌కు మించి అనిపించేలా? త‌ననితాను వ్య‌క్తిగ‌తంగా ఫోక‌స్ చేసుకునే ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గానే చేస్తోంది. కొంత‌వ‌ర‌కూ ఆ ర‌కంగా స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి.


సాధార‌ణంగా సీనియ‌ర్ నటీమ‌ణ‌ల‌కు సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా రిపిటేష‌న్ ఉండ‌దు. కానీ ఈ బ్యూటీని మాత్రం గుర్తించి పెద్ద‌గానే ఫోక‌స్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇదే అదునుగా అమ్మ‌డు వేడి కూడా ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు. టైమ్ వ‌చ్చిన‌ప్పుడే ఫేమ‌స్ అయిపోవాలి అన్న చందంగా ఇన్ స్టా లో అదే దూకుడు కొన‌సాగిస్తుంది. తాజాగా జ్యోతిరాయ్ చిట్టి...పొట్టి దుస్తుల‌కు దూరంగా ఉంటూ సంప్ర‌దాయ చీరందంలో త‌ళ‌కులీనిన కొత్త ఫోటోని పోస్ట్ చేసింది.


ఇదిగో ఇక్క‌డిలో పువ్వుల చీర‌లో అందంగా ముస్తాబైంది. నుదిటిన స‌న్న‌ని చిన్న బొట్టు..పెదాల‌కు లిప్ స్టిక్ లైట్ మ్యాక‌ప్ తో అందంగా క‌నిపిస్తుంది. కానీ ఈ ఫోటో ఇప్ప‌టిదా? పాత ఫోటానా? అన్న‌ది క్లారిటీ రావాలి. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల‌కు...ఈ ఫోటోల‌కు పొంత‌న కుద‌ర‌డం లేదు. అమ్మ‌డి వ‌య‌సు 35 ఏళ్లు పైనే ఉంటుంది. కానీ ఈ పిక్ లో 25 ప్రాయం బ్యూటీలా క‌నిపిస్తుంది.

దీంతో ఇది పాత ఫోటో అని కొంత మంది అభిమానులు..కాదు కాదు కొత్త‌దే అంటూ మ‌రికొంత మంది సందేహ‌ప‌డుతున్నారు. మ‌రి ఇది 35 వ‌య‌సు పిక్ నా? 25 ఏళ్ల వ‌య‌సులో ఉన్న త‌నా? అన్న‌ది క‌న్ప‌మ్ చేయాల్సింది జ్యోతిరాయ్ మాత్ర‌మే. ప్ర‌స్తుతం జ్యోతిరాయ్' ప్రెట్టి గ‌ర్ల్' అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అలాగే 'మాస్ట‌ర్ పీస్' అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడితో అమ్మ‌డు డీప్ లవ్ లో ఉన్న‌ట్లు క‌థ‌నాలు వెడెక్కిస్తు న్నాయి.

Tags:    

Similar News