చందమామ కాపురం హైదరాబాద్ లోనే!
మరి ఇన్ని తెలుగు సినిమాలు చేస్తోన్న అమ్మడు కాపురం ముంబైలో ఉంటుందా? హైదరాబాద్ లో ఉంటుందా?
చందమామ కాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే మరోవైపు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుం టుంది. మరి ఇన్ని తెలుగు సినిమాలు చేస్తోన్న అమ్మడు కాపురం ముంబైలో ఉంటుందా? హైదరాబాద్ లో ఉంటుందా? ఈమె షూటింగ్ లతో బిజీగా ఉంటే బిడ్డను ఎవరు చూసుకుంటున్నారు? అని అభిమానులకు చాలా సందేహాలున్నాయి.
తాజాగా వాటన్నింటిపై అమ్మడు క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం కాజల్ 'సత్యభామ' అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా ఒకటి చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. 'మేజర్' చూసిన వెంటనే శశికిరణ్ తో పనిచేయాలనిపించింది. సత్యభామకి ఆయన దర్శకుడు కాకపోయినా నిర్మాతగా చేస్తోన్న సినిమాలో నేను నటిస్తున్నాను. భగవంత్ కేసరి సమయంలో హైదరాబాద్ లో ఈ కథ విన్నా.
ఈ సినిమాలో నటించాలని మకాం ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చేసా. అప్పటి నుంచి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నా. బాబను చూసుకుంటూ షూటింగ్ కి వెళ్తున్నా. సత్యభామ కోసం మిక్సుడ్ మార్షల్ ఆర్స్ట్ కూడా నేర్చుకున్నా. ఈ సినిమాలో నటించడానికి విజయశాంతి గారు స్పూర్తి. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె గుర్తొస్తారు. ఇంతకు ముందు సినిమాలు ఒక ఎత్తతే..ఇది మరో ఎత్తు. షూటింగ్ క్లైమాక్స్ వచ్చేసింది. మంచి సినిమా అవుతుంది' అన్నారు.
మొత్తానికి కాజల్ సెకెండ్ ఇన్నింగ్స్ ని తెలివిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. హిందీలో కెరీర్ ఆరంభంలో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లోనే స్థిరపడింది. ఇక్కడ దక్కిన గుర్తింపు హిందీలో దక్కలేదు. దీంతో పెళ్లి తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ గుర్తింపుతోనే తెలుగు లో మళ్లి లేడీ సింగంలా దూసుకొచ్చింది. సీనియర్ నాయికల జాబితాలో హీరోయిన్ అవకాశాలు చేజిక్కించు కుంటుంది. మరో మూడు..నాలుగేళ్లు ఇక్కడే సినిమాలు చేసే అవకాశం ఉంది.