ఆచార్య తర్వాత మరో ఛాన్స్ మిస్?

చంద‌మామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అగ్రగామి నటీమణుల్లో ఒకరు

Update: 2024-07-14 06:16 GMT
ఆచార్య తర్వాత మరో ఛాన్స్ మిస్?
  • whatsapp icon

చంద‌మామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అగ్రగామి నటీమణుల్లో ఒకరు. రెండు దశాబ్దాలుగా త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాజల్ తన అందం, ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో మైమ‌రిపించింది. మగధీర (2009), డార్లింగ్ (2010), చంద‌మామ స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో కనిపించిన కాజల్ త‌మిళంలోను చెప్పుకోద‌గ్గ ప్రాజెక్టుల్లో న‌టించింది. హిందీలో అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న న‌టించింది.

అయితే కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లును పెళ్లాడి ఒక కిడ్ కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి స‌మ‌యంలో చిరంజీవి `ఆచార్య` స‌హా నాగార్జున లాంటి అగ్ర హీరో సినిమా `ఘోస్ట్` నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. కొన్ని వ‌రుస ప్రాజెక్టుల్లో కాజ‌ల్ కి అవ‌కాశం వ‌చ్చినా కానీ వైదొలిగింది. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 మిన‌హా ఇత‌ర ప్రాజెక్టుల‌న్నిటినీ కాజ‌ల్ వ‌దులుకుంది. కానీ ఇప్పుడు భార‌తీయుడు 2లో కాజల్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోవ‌డంతో నిరాశ ఎదురైంది.

ఆచార్య‌, ఘోస్ట్ త‌ర్వాత కూడా ఇప్పటికీ కాజ‌ల్ కి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. భార‌తీయుడు 2 లాంటి క్రేజీ సినిమాలో కాజ‌ల్ కి న‌టించేందుకు అస్స‌లు స్కోప్ లేక‌పోవ‌డంతో దీనిపై అభిమానులు ఎంతో క‌ల‌త చెందుతున్నారు. అయితే కాజ‌ల్ పాత్ర ఇందులో ఏమంత క‌నిపించ‌క‌పోయినా కానీ, భార‌తీయుడు 3 (పార్ట్ 2కి సీక్వెల్) లో మాత్రం చెప్పుకోద‌గ్గ లెంగ్తీ పాత్ర‌లో మెప్పిస్తుంద‌ని శంక‌ర్ భ‌రోసానిచ్చారు. నిజానికి ఇండియన్ 2 టీజర్, ట్రైలర్స్‌లో కూడా కాజల్‌ని ఎక్కడా చూపించలేదు.

ఇండియన్ 3 (భార‌తీయుడు 3)కోసం బి జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్ త‌దిత‌రులు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సీక్వెల్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ - రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది భారతీయుడు ట్ర‌యాల‌జీలో చివరి భాగం. ఇండియన్ 2కి ప్రత్యక్ష సీక్వెల్.

Tags:    

Similar News