నోరు జారిన హీరోయిన్... హీరో ఫ్యాన్స్ ఆవేశం

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్‌

Update: 2023-07-17 05:27 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్‌ గత చిత్రం పఠాన్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత షారుఖ్‌ నటించిన సినిమా సక్సెస్ అవ్వడం.. అంతే కాకుండా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాలో పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ నిజం కాదంటూ ప్రచారం చేస్తున్నారు.

అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పఠాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయి అంటూ చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. యూనిట్‌ సభ్యులు వెయ్యి కోట్ల వసూళ్లు అంటూ ఆర్భాటంగా ప్రచారం చేశారు కానీ అసలు సినిమా కలెక్షన్స్ రూ.500 కోట్లు నుండి రూ.600 కోట్లు వరకు ఉండవచ్చు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో సాధారణ జనాలు ఇప్పటి వరకు పఠాన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రెటీలు ఎవరు కూడా వాటి గురించి మాట్లాడలేదు. మొదటి సారి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ కాజోల్‌ 'పఠాన్‌' కలెక్షన్స్ గురించి చేసిన నోరు జారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

కాజోల్‌ నటించిన 'ది ట్రయల్‌' ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రమోషన్‌ లో భాగంగా కాజల్‌ ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడటం జరిగింది. మళ్లీ షారుఖ్ తో సినిమా చేయాలని ఉంది... అందులో తమ ఇద్దరి మధ్య ఒక మంచి రొమాంటిక్ సాంగ్‌ ఉండాలని ఉందంటూ సమాధానం చెప్పింది.

అదే సమయంలో షారుఖ్‌ ఇప్పుడు కలిస్తే ఆయన్ను మీరు ఏం ప్రశ్న అడుగుతారు అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించగా... వెంటనే కాజోల్‌ స్పందిస్తూ... పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను అంది. అంటే ఆమె ఉద్దేశ్యంలో పఠాన్ సినిమా కలెక్షన్స్ వెయ్యి కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అసలు కలెక్షన్స్ ఎంత అన్నట్లుగా వెటకారంగా ఉందని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఆమె పొరపాటున నోరు జారి ఆ మాట అని ఉంటుంది. అయినా ఆమెను షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. ఓ రేంజ్ లో ఆమె తీరును తప్పుబడుతున్నారు. షారుఖ్‌ అంటే అభిమానం అంటూనే ఇలాంటి అవహేళన చేసే మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కాజోల్‌ ను చాలా మంది ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం పై కాజోల్‌ స్పందన ఏంటో చూడాలి.

Tags:    

Similar News