'కల్కి' బుజ్జీ గురించి ఈ విషయం తెలుసా..!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి

Update: 2024-05-30 10:02 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా వచ్చిన బుజ్జి కారు కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను రూపొందించాడు.

సాధారణంగా ఒక సినిమాకు ప్రత్యేకమైన వాహనం లేదా సెట్‌ కావాలి అంటే తాత్కాలికంగా నిర్మిస్తారు, తయారు చేస్తారు. కానీ కల్కి కోసం కావాల్సి వచ్చిన కారును ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసి తయారు చేశారు. ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాలో కూడా చూడనటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు.

కల్కి గురించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్టార్స్ మరియు సెలబ్రిటీలు అంతా కూడా బుజ్జీ పై రైడ్ కి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ కారు అయిన బుజ్జీ వేగం 40 KMS గా మేకర్స్ చెబుతున్నారు. ఆరున్నర టన్నుల బరువు తో ఉన్న బుజ్జీ అంత వేగంగా ప్రయాణించడం సాధారణ విషయం కాదు.

మూడు టైర్లతో ఏర్పాటు చేసిన ఈ బుజ్జి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా పై అంచనాలు పెరిగే విధంగా ఇప్పటికే బుజ్జీ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ప్రస్తుతం తమిళనాడు చెన్నైలో ఉన్న బుజ్జీ అతి త్వరలోనే ఉత్తర భారతంలో రైడ్‌ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్‌, దీపికా పదుకునే, కమల్‌ హాసన్‌, అమితాబచ్చన్‌, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్‌, నాని వంటి స్టార్స్ ఉన్నా కూడా కేవలం బుజ్జి కోసం సినిమాని చూడాలి అనుకుంటన్న వారు చాలా మంది ఉన్నారు. జూన్‌ 27న విడుదల రాబోతున్న కల్కి సినిమా హాలీవుడ్‌ రేంజ్ కి ఏమాత్రం తగ్గడం లేదు. వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంతా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News