'కల్కి' లీగల్ యాక్షన్​.. వారందరికీ వార్నింగ్​

అయితే తాజాగా ఈ విషయం నిజమేనని అర్థమైంది. లీకర్స్​కు, అలాగే లీకైనా వాటిని షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు మూవీ మేకర్స్.

Update: 2023-09-21 09:07 GMT

ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న సినిమా 'కల్కీ-2898ఏడి'. ఈ చిత్ర బడ్జెట్ రూ.500 కోట్లకు పైమాటే అని చెబుతున్నారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం చేస్తూనే వస్తున్నారు. అందుకు తగ్గట్లే గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కూడా. అయితే ఈ చిత్రానికి కూడా లీకుల బెదడ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై మూవీటీమ్​ లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.


అయితే తాజాగా ఈ విషయం నిజమేనని అర్థమైంది. లీకర్స్​కు, అలాగే లీకైనా వాటిని షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు మూవీ మేకర్స్. "కల్కి 2898 ఏడీ సినిమా, దానికి సంబంధించిన ఏ విషయమైనా కాపీరైట్స్​ పరిధిలోకి వస్తాయి. సినిమాకు సంబంధించి సీన్స్​, ఫుటేజ్​లు లేదా ఫొటోస్​ ఏదీ షేర్ చేసినా అది చట్ట విరుద్ధం. అందుకు చట్ట పరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే తప్పకుండా సైబర్ క్రైమ్​ పోలీసుల ద్వారా మేం లీగల్ యాక్షన్​ తీసుకుంటాం" అని మూవీటీమ్​ నోట్ రిలీజ్ చేసింది.

ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ లీక్​ల విషయంపై పెద్ద చర్చలే జరుగుతున్నాయని తెలిసింది. రీసెంట్​గా రామ్ చరణ్​ గేమ్​ ఛేంజర్​, మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి కూడా సాంగ్​, పిక్స్​ లీక్​లు అయ్యాయి. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత దిల్​ రాజు సీరియ్ కూడా అయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తూ హెచ్చరిక జారీ చేశారు.

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. మొదట ట్రోలింగ్ జరిగినా తర్వాత మంచిగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది.

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ కల్కి సినిమాను మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News