ప్రభాస్ 'కల్కి'.. ఆ హీరోయిన్ స్పెషల్ క్యామియో!

ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కి పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి

Update: 2024-02-06 19:43 GMT

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కి పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలోనే క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోలు క్యామియో రోల్స్ చేస్తున్న ఈ మూవీలో 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సైతం స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాగ్ అశ్విన్ 'కల్కి' లో ఫిమేల్ క్యామియో కోసం మృణాల్ ఠాకూర్ ని అప్రోచ్ అవ్వగా.. అందుకు మృణాల్ ఓకే చెప్పినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం.

మృణాల్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన 'సీతారమం' సినిమాని నిర్మించింది వైజయంతి మూవీస్ సంస్థే. దానికి తోడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ వదులుకుంటుంది? అందుకే మృణాల్ 'కల్కి'లో స్పెషల్ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ పలు విభిన్న తరహా పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మే 9న పాన్ వరల్డ్ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక మృణాల్ ఠాగూర్ విషయానికొస్తే.. రీసెంట్ గా 'హాయ్ నాన్న' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News