కల్కి 2898 AD - ఆ బిగ్ రికార్డ్ కూడా బ్లాస్ట్ అయ్యింది
బాలీవుడ్ స్టార్ హీరోలని సైతంగా డార్లింగ్ కల్కి బీట్ చేస్తూ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది.
నార్త్ అమెరికాలో కల్కి కలెక్షన్స్ ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజు నుంచి సినిమా పాజిటివ్ టాక్ తో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేస్తుకుంటూ దూసుకుపోతోంది. ఇండియన్ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పడంతో అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. కచ్చితంగా ఈ మూవీ లాంగ్ రన్ లో వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్ని రోజుల్లో ఈ కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోలని సైతంగా డార్లింగ్ కల్కి బీట్ చేస్తూ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఏ సినిమాకి సాధ్యం కానీ రికార్డ్ ని కల్కి మూవీ సాధించింది. కేవలం ఆరు రోజుల్లోనే 100+ కోట్ల కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో కల్కి మూవీ వసూళ్లు చేసింది. ఇది నిజంగా రేట్ ఫీట్ అని చెప్పొచ్చు.
కేవలం డార్లింగ్ ప్రభాస్ స్టామినాకి బలమైన కంటెంట్ తోడవడంతోనే ఇది సాధ్యం అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 12.8 మిలియన్ డాలర్స్ ని నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. తద్వారా నార్త్ అమెరికాలో ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల జాబితాలో కల్కి మూవీ టాప్ 6లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న అమీర్ ఖాన్ దంగల్ ని కల్కి బీట్ చేసింది. మంగళవారం కల్కి మూవీకి 850కె డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయంట.
నార్త్ అమెరికాలో కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉన్న మూవీ బాహుబలి. ఈ సినిమా లాంగ్ రన్ లో 20.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుంది. తరువాత స్థానంలో 17.4 మిలియన్ డాలర్స్ తో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది. మూడో స్థానంలో 15.2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో జవాన్ నిలిచింది. నెక్స్ట్ రణబీర్ కపూర్ యానిమల్ మూవీ 15.2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించి 4వ స్థానం సాధించింది. ఐదో స్థానంలో 14.2 మిలియన్ డాలర్స్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉంది. దీని తర్వాత స్థానంలోకి కల్కి చిత్రం వచ్చింది.
త్వరలో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ని కల్కి బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో 15+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ సాధిస్తుందని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ నార్త్ ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని కల్కి బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది.