కల్కి 2898AD.. మొదట ఆ సీనియర్ హీరోకి చెప్పి..

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ చిత్రగా కల్కి 2898ఏడీ మూవీ జూన్ 28న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది

Update: 2024-05-27 04:02 GMT

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ చిత్రగా కల్కి 2898ఏడీ మూవీ జూన్ 28న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. భారత్ లో ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ కల్కి కావడంతో భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొని ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో కనిపించబోతున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.

దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ తో కల్కి 2898ఏడీ చిత్రంలో జత కట్టారు. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా సిద్ధమైన కల్కి2898ఏడీని ఏకంగా 22 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. కల్కి మూవీతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ హాలీవుడ్ లెవల్ లో అందరికి తెలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి.

వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కాబోయే ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ అగ్రెసివ్ గా చేస్తోంది. కల్కి 2898ఏడీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారు(బుజ్జి)ని గ్రాండ్ గా రివీల్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ చేసి సినిమాని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే అసలు కల్కి మూవీ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందనే దానిపై ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ ఈ మూవీ కథ సిద్ధం చేసిన తర్వాత అశ్వినీదత్ రెబల్ స్టార్ కృష్ణంరాజుని సంప్రదించారంట. తమ దగ్గర మంచి కథ ఉందని ప్రభాస్ కి కరెక్ట్ గా సరిపోతుందని చెప్పారంట. ప్రభాస్ తో మీరే ఒక మాట చెప్పాలని అడిగారంట. దానికి ఒకే చెప్పిన కృష్ణంరాజు కథ వినమని ప్రభాస్ కి చెప్పడం, ఆయన స్టోరీ విని ఒకే చెయ్యడం జరిగిందంట.

అలా మొదలైన మూవీ నాగ్ అశ్విన్ విజన్ నుంచి అద్భుతమైన విజువల్ వండర్ గా ఆవిష్కృతం అయ్యింది. చిత్ర యూనిట్ రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించి చేసిన కృషిని జూన్ 28న ఆడియన్స్ థియేటర్స్ లో చూడబోతున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. మరి కల్కి 2898ఏడీ ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాలి.

Tags:    

Similar News