కల్కి 2898ఏడీ… ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

మొత్తంగా చూసుకుంటే ఆర్టిస్ట్స్ అందరి రెమ్యునరేషన్ కలుపుకుంటే 250 నుంచి 300 కోట్ల మధ్యలో బడ్జెట్ తేలినట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-06-23 06:55 GMT

వైజయంతీ మూవీస్ కల్కి 2898ఏడీ చిత్రాన్ని ఏకంగా 600+ కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఇండియాలో ఇప్పటి వరకు తెరకెక్కిన చిత్రాలలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే అని చెప్పాలి. అలాగే ఈ చిత్రాన్ని ఏకంగా 22 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. మూవీలో ఆల్ మోస్ట్ ఇండియన్ యాక్టర్స్ మాత్రమే నటించారు. నాగ్ అశ్విన్ ఈ ఫ్యూచర్ యూనివర్స్ ని కల్కి 2898ఏడీ కోసం సృష్టించాడు.

ఇప్పటికే మూవీ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ ట్రైలర్స్ పెంచేశాయి. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో భైరవ పాత్రలో నటించారు. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించబోతున్నారు. కమల్ హాసన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా చేశారు. దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో నటించారు. అలాగే చాలా మంది స్టార్ వై యాక్టర్స్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన వారి రెమ్యునరేషన్ ఏకంగా 250-300 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కి మూవీ కోసం 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని ప్రభాస్ ఈ చిత్రం కోసం అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కి 20 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే కమల్ హాసన్ కి కూడా 20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. దిశా పటానికి 5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా ఇతర లీడ్ రోల్స్ లో చేసిన వారికి కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ని ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఆర్టిస్ట్స్ అందరి రెమ్యునరేషన్ కలుపుకుంటే 250 నుంచి 300 కోట్ల మధ్యలో బడ్జెట్ తేలినట్లు టాక్ వినిపిస్తోంది.

మిగిలిన బడ్జెట్ మూవీ కోసం ఉపయోగించారంట. ఈ సినిమా 1000 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ బుల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ టచ్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News