కల్కి చూసాక… రాజమౌళికి మొగుడొచ్చాడు అనిపించిందా?
కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ ని సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ ని సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీ కాన్వాస్ పై ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా కల్కి మూవీని నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. 4 ఏళ్ళుగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ వర్క్ చేశారు. ఫైనల్ గా ప్రేక్షకులు అందరూ సంతృప్తి చెందేస్థాయిలో బెస్ట్ అవుట్ ఇచ్చారు. కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ నాగ్ అశ్విన్ కి ఇవ్వాలి.
నాగ్ అశ్విన్ కి దర్శకుడిగా కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ స్టార్స్ ని ప్రభాస్, దీపికా పదుకునే లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఇమేజ్ వెయిట్ ని మోశాడు. వారిని పెర్ఫెక్ట్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని రాబట్టుకున్నాడు. ఈ రోజు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న స్టార్ నాగ్ అశ్విన్ క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు అంటే వారిని ఏ స్థాయిలో ప్రభావితం చేశాడో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే ఎంతో మంది స్టార్స్ తో సినిమాలు చేసిన అశ్వినీదత్ లాంటి బడా నిర్మాత నాగ్ అశ్విన్ టాలెంట్, కథని నమ్మి 600+ కోట్లు పెట్టడానికి ధైర్యం చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ విషయంలో కూడా నాగ్ అశ్విన్ టాలెంట్ ని అభినందించాల్సిందే. మూడో సినిమాతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం అనేది మామూలు విషయం కాదు. దర్శక దిగ్గజం రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సుదీర్ఘ ప్రయాణం చేశారు.
అయితే నాగ్ అశ్విన్ కల్కి కంటే ముందు రెండే సినిమాలు చేశాడు. ఆ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే కంటెంట్ పరంగా రెండు క్లాసిక్ మూవీస్ అనిపించుకున్నాయి. కల్కి చిత్రంలో క్లాస్ టచ్ తో పాటు మాస్ అప్పీల్ కూడా హెవీగా ఉంది. అయిన అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకే రాజమౌళికికి మొగుడొచ్చాడు అనే మాట వినిపిస్తోంది. దీనిని నాగ్ అశ్విన్ చాలా వినయంగా స్వీకరించాడు.
ఈ క్రెడిట్ అంతా కూడా నన్ను నమ్మిన ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి చెందుతుంది. అలాగే సినిమాలో పాత్రలకి వారైతేనే పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని నమ్మి తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్లుగానే వారు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాని టాప్ లోకి తీసుకెళ్లారు. తనకొచ్చే ఏ క్రెడిట్ అయిన దానికి కారణం నన్ను నమ్మిన వారికే చెందుతుందని మీడియా మీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ మాటలకి ఓ విధంగా అందరూ ఫిదా అయ్యారని చెప్పొచ్చు.