తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి ప్రీరిలీజ్ క్యాన్సిల్?

మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రం `కల్కి 2898 AD` చివరి ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు.

Update: 2024-06-21 04:24 GMT

మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రం `కల్కి 2898 AD` చివరి ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ప్రభాస్ అభిమానులు దీనిని చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ముంబైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హిందీ బెల్ట్‌లో ఉత్సాహాన్ని పెంచింది. భార‌త‌దేశంలో తొలి సైన్స్ ఫిక్ష‌న్ సినిమాని వీక్షించాల‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ గుస‌గుస‌ల ప్ర‌కారం.. ముంబైలో ఈవెంట్ జ‌రిగిన కానీ, అశ్వ‌నిద‌త్ బృందం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో ఎలాంటి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయ‌లేద‌ని గుసగుస వినిపిస్తోంది. ముందుగా ఈ మెగా ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత వేదికను హైదరాబాద్‌కు మార్చినట్లు ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు రూట్ మారింది. రూమర్స్ ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారని ప్ర‌చార‌మ‌వుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆస‌క్తిక‌రంగా స‌లార్ విడుదలకు ముందు ఎటువంటి ప్రత్యేక కార్యక్రమం కూడా చేయలేదు. కల్కి 2898 AD మేక‌ర్స్ మొదటి నుండి ప్రత్యేకమైన ప్రమోషన్‌లతో దూసుకెళ్లారు. మొద‌ట్లో ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రత్యేక ప్రోమోలను టెలికాస్ట్ చేసి సినిమాను మార్కెట్ చేశారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి వాహనాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించడం ప్రారంభించారు. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట‌ర్వ్యూలో ప్రత్యేక ఎపిసోడ్‌లు ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్నాయి. వీట‌న్నిటితో క‌ల్కి చిత్రానికి కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కింది. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ కోసం త‌పించ‌డం లేద‌ని తెలిసింది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత ఛటర్జీ, శోభన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.

Tags:    

Similar News