కల్కి థియేటర్లు హౌస్‌ఫుల్.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు..

విడుదలకు ముందు ఇది మామూలుగానే ఉన్నా విడుదల అనంతరం చాలా పెద్ద సినిమా అని ముందుగానే అశ్వినిదత్ హింట్ ఇచ్చారు.

Update: 2024-06-27 10:48 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898AD గ్రాండ్ గా నేడు విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాగా దీన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఇక మొదటి షో నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. విడుదలకు ముందు ఇది మామూలుగానే ఉన్నా విడుదల అనంతరం చాలా పెద్ద సినిమా అని ముందుగానే అశ్వినిదత్ హింట్ ఇచ్చారు.

ఇక తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఏ, బీ, సీ సెంటర్లలో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. కళకళలాడుతున్న థియేటర్లలో ఈ సినిమా విడుదలవడంతో ఫ్యాన్స్ హుషారుగా ఉన్నారు. చాలా రోజుల తరువాత అన్ని లాంగ్వేజెస్ కు సంబంధించిన బాక్సాఫీస్ ల వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంది.

కల్కి సినిమాకు ఫస్ట్ షోల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. అద్భుతమైన మైథాలజీ స్కై ఫై కథా నేపథ్యంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కల్కి, రికార్డ్ స్థాయి టికెట్ అమ్మకాలు సాధించింది. ఎర్లీ మార్నింగ్ షోలు నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం, సినిమా రన్‌ని మరింత గ్రాండ్‌గా మార్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అందడంతో, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు స్పందిస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, ప్రభాస్ నటన, అద్భుతమైన విజువల్స్ కల్కి సినిమాను ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభవంగా మలిచాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్ అమ్మకాల్లో కల్కి రికార్డ్ స్థాయిలో ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా కల్కి 2898AD పర్‌ఫార్మెన్స్ ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు ప్రభాస్ నటనతో పాటు, కథలోని ట్విస్ట్‌లు, ప్రత్యేకంగా రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు కూడా తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరి ప్రదర్శన సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

మొత్తానికి, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898AD సినిమా విడుదలతో తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. రికార్డ్ స్థాయి టికెట్ అమ్మకాలు, ప్రేక్షకుల అనుభవం, సినిమా గ్రాండ్ విజువల్స్ కల్సి, కల్కి 2898AD సినిమాను అద్భుతమైన విజయానికి నడిపిస్తున్నాయి. మరి మొదటి రోజు సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News